శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె. నాదు హృదయమందు నాదు చెవులయందు
నయనయుగమునందు నాల్కయందు
మహిమగల్గినట్టి ‘మధుర’ మధురముగా
నిలచియుండుగాక! నిశ్చలముగ॥
భావం: కృష్ణా ! నా హృదయంలో, చెవులలో, కళ్లల్లో, నాల్కపై మహిమాన్వితమైన మధురానగరం యొక్క శోభలు నిలిచి యుండుగాక! కృష్ణ భక్తులు కృష్ణుడు చేసిన చేతలన్నీ మధురంగా కృష్ణకథలుగా మలుచుకుని మరీ మరీ చెబుకుంటూ మానసోల్లాసాన్ని పొందుతుంటారు. కృష్ణుడు నివసించిన మధురను కూడా మరవలేక మా నాల్కలపై మధుర నిలిచిఉండాలని తలుస్తున్నారు. ( శ్రీగోవింద మిశ్రుడు)
తే.గీ. ముగ్ధ మోహన రూపు డౌ ముద్దు కృష్ణు
అంకమందున జేర్చియు నాటలాడి
ప్రేమ లాలించి పాలించి పెంచినట్టి
ఆ యశోదమ్మకు హృదిని అంజలింతు
భావం: చిన్ని కృష్ణుని ఒడిలో చేర్చుకొని లాలించి పాలించి పెంచిన యశోదమ్మకు హృదయ పూర్వకంగా నమస్కరిస్తున్నాను. కృష్ణుడు కన్న తల్లిదండ్రులు, పెంచిన యశోదనందనులు ఎంతటి భాగ్య వంతులో కదా కృష్ణ్భక్తులు వారిఅదృష్టానికి వీరు పొంగిపోతూ ఆనందిస్తుంటారు. (శ్రీరూప గోస్వామి)

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949