శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. నాల్గుగోడల మధ్యన నలిగిపోవ
నేల బావిలో ఁ గప్పగనేల యుండి
పోదురే సమాజమువైపుఁ బోవరేల?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: నాలుగు గోడల మధ్య నలిగిపోవడం దేనికి? కూపస్థమండూకంలా మనుగడ సాగించినందువల్ల ప్రయోజనమేముంది? మానవులు సంఘజీవులే. మరి అలాంటపుడు సమాజంలో మమేకమై చుట్టూతా ఉన్నవాళ్ల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ మంచి చెడులు విచారించుకుంటూ మనుగడ సాగించరెందుకనో ? కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ఈ మనుష్యుల ల్లో విచక్షణను కలిగించవయ్య.
తే.గీ. మేలు సేసిన సంతృప్తి నేలుకుందు
వటుల ఁ గానంచు ఁ గీడు సేయంగ ఁబూను
వాడవైనను దుఃఖంబు వరదయోగ
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఇతరులకు మేలు చేయడం వల్ల కలిగే సంతృప్తి ఇంతా అంతాకాదు. అలా కాకుండా పరులకు హాని తలపెట్టడానికి పూనుకొంటే మాత్రం తుదకు కలిగేది దుఃఖమే. ఆ దుఃఖమే వరదై ముంచేస్తుందనడంలో సందేహం లేదు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఇతరులకు మేలు చేయకున్నా ఫరవాలేదు. హానిమాత్రం చేయవద్దని నీవే చాటి చెప్పాలి ప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262