శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. మధుర లోనున్న జనులిచ్చు మధురమైన
ఘృత పదార్థములను స్వీకరించినట్లె
వల్ల వీజన నికరంపు పరమమైన
ప్రేమను ప్రియముగా స్వీకరించినటేల
విదురుడిచ్చిన విందును స్వీకరించి
నట్లె, ఆకు చేలు అటుకులందినట్లె
నాదు అత్యల్పమగు భక్తి నాదరించి
కావు మోపరమ పవిత్ర కంజనేత్ర

భావం: కృష్ణా! మధురలో జనులిచ్చే నేతితో చేసిన మధుర పదార్థములను స్వీకరించి నట్లే గోపికల యోక్క నిర్మల మైన ప్రేమను స్వీకరించినట్లే విదురుడిచ్చిన విందు నారగించినట్లే కుచేలుని అటుకులు స్వీకరించినట్లే అత్యల్పమైన నా భక్తిని కూడా స్వీకరించి నన్ను రక్షించు స్వామి. భగవంతుడు భక్తసులభుడు. భగవంతుని ఆర్తితో పిలిస్తే ఓ అని పలుకుతాడు. ఈ విషయాన్ని ఎందరో భక్తులు వారి వారి నిజజీవితాలల్లో అనుభవించినట్లు వారి జీవిత చరిత్రలు చెబుతున్నాయ. (శ్రీభగవద్రామానుజులు )

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949