శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. పిల్లలను పడుకోబెట్టువేళలోనఁ
వారి చెంతకుఁ జెప్పంగఁ బలురకాల
నీతికథలనుఁ జెప్పంగ నేర్వకున్న
నెంత యార్జించి ఫలమేమి?యెంతలైనఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఈ రోజుల్లో పిల్లలను ప్రక్కలో పడుకోబెట్టుకుని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే నేపథ్యంలో భావి భారత పౌరులు పిల్లలే అని గ్రహించే నీతిబోధలను చేసే ప్రబోధాత్మకమైన కథలను ఎంతమంది పెద్దలు చెబుతున్నారని ప్రశ్నించుకుంటే జవాబు దొరకడంలేదు. అలాంటప్పుడు ఎంతవారైనా ఎంత సంపాదించినా ఫలితం శూన్యమేకదా. పెద్దల ద్వారా పిల్లలకు వౌఖిక కథలనువినుభాగ్యాన్ని అందించవయ్య కర్మసాక్షి! ఓ సూర్యదేవా!
తే.గీ. పెదవి దాటిన దాటును పృథ్విమాట
సత్యమని యెఱింగియుఁ గూడ నిత్యజీవి
తానదబ్మలములఁబోలు వేనవేలు
పలుకులనుఁబల్క వెనుదీయరలుకఁగల్గి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: పెదవి దాటితే పృథ్వి దాటుతుందంటారు. ఈ సత్యం తెలిసి కూడా చాలామంది పరుషమైన మాటలనేకంగా మాట్లాడడానికి ఏమాత్రం వెనుదీయడం లేదే. ఎదుటివారి మనస్సును మాటలతో వేధించడం మహాపాపం. గొప్ప గొప్ప జ్ఞానులే కోపావేశాలకు తావిచ్చి దారుణంగా మాట్లాడుతున్నారే! కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! మాటలనేవి మృదుమధురంగా ఉంటే ఉభయతారకంగా ఉంటుందని నీవైనా తెలియజెప్పవయ్య లోకప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262