శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపూర్వ పుణ్యరాశి
ఆ.వె. పరుల కొసగువేళ పరమేశ్వరార్పణ
మనియు తలచుచుందు రఖిల జనులు
భక్ష్యముల నిజముగ పరమాత్ముడు భుజింప
అబ్బు పుణ్యనరయ దరమె
భావం: ఎవరికైనా, ఏదైనా ఇచ్చేటపుడుపరమేశ్వరార్పణం ఇవ్వడం కద్దు. అదేనిజంగా పరమేశ్వరుడే స్వీకరించి మన కనుల ఎదుటే భుజించినట్లయితే ఆ భాగ్యం చెప్పనలవికాదు. ఆ భాగ్యాన్ని పొందిన వారు మునిపత్నులు. విప్రకాంతలు. శ్రీకృష్ణునికి స్వయంగా భక్ష్యభోజ్యములను సమర్పించి ఆనందించే అదృష్టం వారికి దక్కింది.
అన్నీ నీవే
ఆ.వె. అరయ ఆత్మ వీవె పరమాత్మవు నీవె
స్థిరము నీవె , కనగ చరమునీవె
గోపికయును నీవె, గోపాలకుడ వీవె
నీవుకాని దేది? నీరజాక్ష!

భావం: కృష్ణా ! నీ రాసక్రీడ గురించి లోకంలో వివిధమైన భావనలున్నాయి. ఆలోచిస్తే నీవు, గోపకాంతలు వేరు వేరు కాదుకదా. అన్నీ నీవై అంతటా నీవై ఉన్నపుడు ఇట్టి భావనలకు ఆస్కారమేమీ లేదు.

- డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949