బిజినెస్

బొగ్గు రవాణాలో సింగరేణి రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గడచిన 8 నెలల్లో 253 లక్షల టన్నుల సరఫరా
సింగరేణి సిఎండి శ్రీధర్ వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 4: ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) బొగ్గు రవాణాలో రికార్డు సృష్టించామని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ఎన్ శ్రీధర్ తెలిపారు. గడచిన 8 నెల (ఏప్రిల్-నవంబర్)ల్లో 253 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేశామని, మిగిలిన నాలుగు నెల (డిసెంబర్-మార్చి)ల్లో నెలకు 5.5 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. రికార్డు స్థాయిలో బొగ్గు సరఫరా కావడంలో రైల్వే శాఖ పాత్ర కూడా ఉందని, ఇప్పటివరకు 6,669 రేకులను అందజేసినందుకు ఆయన రైల్వేకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సిఎండి శ్రీధర్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీందర్ గుప్తాను ఆయన కార్యాలయంలో కలిశారు. బొగ్గు రవాణాకు అవసరమైన ర్యాక్‌లను కేటాయించి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఒక్క నవంబర్ నెలలోనే గతంలో ఎన్నడూలేని విధంగా 950 రేకుల ద్వారా బొగ్గు రవాణా చేసినట్లు శ్రీధర్ పేర్కొన్నారు. కాగా, రానున్న నాలుగు నెలల్లో చేసే బొగ్గు రవాణా కోసం నెలకు మరో 35 రేకులు సరఫరా చేసేలా చూడాలని రైల్వే జిఎంను ఈ సందర్భంగా కోరినట్లు తెలిపారు. ఇందుకు జిఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. కాగా, పెండింగ్‌లో ఉన్న సింగరేణి ప్రాజెక్టుకు సంబంధించి బొగ్గు రవాణాకు అనుబంధంగా జరుగుతున్న గోలేటి- ఆసిఫాబాద్, కోయగూడెం- బేతంపూడి రైల్వే సైడింగ్‌ల నిర్మాణంపై జిఎంతో చర్చించినట్లు ఒక ప్రకటనలో వివరించారు. గోలేటి రైల్వే సైడింగ్ పనులు మార్చి నెలకల్లా పూర్తయ్యేలా చూడాలని, అలాగే సత్తుపల్లి-కొత్తగూడెం రైల్వే లైను నిర్మాణ వ్యయాన్ని తగ్గించాలని కోరగా రైల్వే జిఎం సానుకూలంగా స్పందించారని శ్రీధర్ తెలిపారు. దీనిపై సింగరేణి, రైల్వే శాఖ అధికారులతో ఒక కమిటీని నియమిస్తామని తెలిపినట్లు వివరించారు. కాగా, చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ జెఎన్ ఝూ, చీఫ్ ఫ్రైట్ ట్రాఫిక్ మేనేజర్ పిఆర్ రెడ్డి, చీఫ్ కమర్షియల్ మేనేజర్ జి లక్ష్మీనారాయణ తదితరులను శ్రీధర్ రెల్వే నిలయంలో కలిశారు.