శ్రీవిరించీయం

కళింగ జీవితాన్ని చిత్రించిన శ్రీకాకుళం కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళింగాంధ్ర కథలు పేరుతో చాగంటి సోమయాజులు గారు చాలా సంవత్సరాల క్రితం కొన్ని కథలు సేకరించి ప్రచురించారు. ఆ పుస్తకం అనేక పునర్ముద్రణలు కూడా పొందింది.
కళింగ రాజ్యంలోనే భాగం అయిన శ్రీకాకుళం జిల్లాలో రచయితలు కొందరు చేరి శ్రీకాకుళ సాహితీ ప్రచురణలు పేరుతో అప్పుడప్పుడు కథా సంపుటాలు ప్రచురిస్తూ వుంటారు. కళింగాంధ్రలో సుందరము, చారిత్రకము అయిన జీవనదులు అయిదు వున్నాయి. అవి: నాగావళి, వంశధార, జంఝావతి, వేగావతి, మహేంద్రతనయ. 1995లో పధ్నాలుగురు కథకులతో మొదటి కథా సంపుటం ‘నాగావళి కథలు’ తీసుకువచ్చారు రుూ సమితి. 1999లో ‘వంశధార కథలు’ పద్ధెనిమిది కథలతో తెచ్చారు. 2006లో ‘జంఝావతి కథలు’ ఇరవై ఒక్క కథలతో ప్రచురించారు. 2014లో ‘వేగావతి కథలు’ అని ఇరవై నలుగురు కథలతో తీర్చిదిద్దారు. ప్రతి సంవత్సరమూ ఒక సంకలనం తీసుకురావాలని వీరికి ఉత్సాహం ఉన్నా, ఒక్కొక్క సంపుటానికి ‘అతి విరామం’ వున్న విషయం చదువరులు గమనించాలి. రచనాశక్తి, ప్రావీణ్యం వున్న రచయితలు ఎందరో వున్నా అందుకు తగిన ఆర్థిక సదుపాయం, సమాదర సహకారం కొరవడడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ప్రభుత్వ సహాయం దొరకదు సరికదా, దానికి ఎన్నో షరతులు - అడ్డంకులు వుంటాయి. ప్రజల సహకారం కోరుకున్నంతగా దొరకదు. కథలకు సాహిత్య ప్రాధాన్యత ఎంతో వున్నదని నెత్తి బాదుకుని చెప్పినా, రుూ పిలుపులు, అరుపులు మామూలు జనాల చెవులకు అందవు, హృదయాలకు పొందవు. అందుచేత కథను ‘చిన్నచూపు’ చూడడమే అన్ని ప్రాంతాలలోను కనిపిస్తోంది.
శ్రీకాకుళం సమితి ప్రచురిస్తున్న సంపుటాలలో విశేషం ఏమంటే- ఆ కథలు ‘కళింగ జీవితాన్ని’ (వర్తమానం, సమీపగతం) చిత్రించేవి అయి వుంటాయి. ముఖ్యంగా 2014లో వచ్చిన ‘వేగావతి కథలు’ సంపుటంలో ‘కళింగలోకి చొచ్చుకు వస్తోన్న, వచ్చిన పెట్టుబడీ, దాని ప్రభావమూ.. యిక్కడి జీవితానెనె్నన్ని మార్పులకు గురిచేస్తున్నదో తెలియజెప్పే కథలు. మారిన పల్లె, పట్నం, నగర జీవితాలకు ......, పంట పొలం, పట్నంలో షాపింగ్ మాల్, నదులూ, సముద్రం అడవి, కొండ.. సహజ వనరుల కళింగసీమ ఏ మార్పులకు గురి అవుతున్నదీ, వాటి మంచి చెడులేమిటి, యిక్కడి జన జీవితాలలో వాటి ప్రభావం ఏమిటి అన్నది.. వివరంగా చెప్పుతాయి ఈ కథలు.
బాగా పేరు పడిన రచయితలతోపాటు, అదే సరసన కొత్త రచయితల కథలను కూడా చేర్చి సంతులీకరణం చేయడం ఆమోదయోగ్యం అయిన పద్ధతి. కొత్తవారెప్పుడూ కొద్దివారు కాదు గదా!
కథలన్నింటిలో శ్రీకాకుళం భాష, యాస, పడికట్టు ప్రయోగాలు చక్కగా అమరి అలరిస్తాయి. మాండలికం అయిన కథలు అర్థం చేసుకోవడం మొదట్లో కష్టం అయినా, ‘యిది కూడా నా భాషే, రుూ ప్రజలూ నా వాళ్లే’ అనుకున్నప్పుడు ఆ ఇబ్బంది అంతగా బాధాకరం కాదు.
సంజోడి అన్న కథలో సంభాషణలు చూడండి:
‘‘నన్నొగ్గి ఎక్కడికి ఎల్లవా?’ అడిగిందో రోజు సంజోడి గోముగా.
‘ఎక్కడికెల్లమంతావు సెప్పు’ తిరిగి ప్రశ్నించేడు.
‘ఎక్కడికంతే నేనేటి సెప్తానూ.. మొగుడిని మొలన దోపేసి తిరుగుతుందని ఊరోలందరూ నాను అంతారు కదే!
‘నీనేటి ఊరోళ్ల పెల్లం సుట్టూ తిరగనేదు- నా పెల్లం సుట్టే గదేటి తిరుగుతున్నాను’ అని పనిలో తాను నిమగ్నమైపోనాడు.
ఈ సంజడీ అనే ఆమె గ్రామంలో ‘తాగుడు’ (మద్యపానం, నాటుసారా) తగ్గించటానికి ప్రత్యేకించి ఒంటరిగానూ, జంటగానూ ప్రయత్నం చేస్తుంది. ఒక పక్క బీదరికం, భూమి అమ్మకంలో దగా, డబ్బు రాకపోవడం.. రుూ ఇబ్బందులన్నీ ఆ సంసారం అనుభవిస్తూనేవుంది. ‘చేజారిపోయిన భూముల విషయమై ప్రశ్నించటానికీ, ఎక్కడ యే సారా పొయ్యి వెలిగినా ఆర్పడానికి నిశ్చయించుకున్నట్టు మెట్ట మునేసి కొంగు బొడ్లో దోపుకుంది’ సింజీడి.
‘పక్కింటి ముసలోడు తనలో తాను నవ్వుకున్నాడు. తన పాదాల కంటిన పొయ్యి బుగ్గిని కడిగేసుకున్నాడు- అనడంతో సాంకేతికంగా కథ ముగుస్తుంది.
ప్రతి కథ ‘గ్రామాలలో జరుగుతున్న దురాగతాలు, అభివృద్ధి ప్రయత్నాలు, ప్రకృతితో అనుసంధించుకునే సాధన ప్రక్రియలు’ యధాతథంగా - యాధావిధిగా వ్యక్తీకరిస్తుంది.
ఇటువంటి ప్రాంతీయతని ప్రతిబింబిస్తూనే, దేశ ఏకత్వానికి- మానవ సముదాయ సమాహారానికి దోహదం చేసే కథా సంపుటాల అవసరం ఎంతయినా వుంది. ప్రాంతీయతను పక్కన పెట్టడానికి వీలు లేదు (మార్జినలైజేషన్ కుదరదు). పక్కన పెట్టేస్తే మనమే మానవాళిగా పక్కకు నెట్టేయబడతాం.

-శ్రీవిరించి