జాతీయ వార్తలు

జనతా కర్ఫ్యూలో పాలుపంచుకుందాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు టీమ్ ఇండియా మద్దతు పలికింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ,కోచ్ రవిశాస్ర్తీ, ఇంకా పలువురు క్రీడాకారులు బాసటగా నిలిచారు. మనమంతా బాధ్యతాయుతమైన పౌరులం. మన ఆరోగ్య భద్రత కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును పాటిద్దాం అని పిలుపునిచ్చారు. ఇదిలావుండగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిచెందటం, మరణాలు సంభవించటంతో జాతి నుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కరోనా వైరస్‌తో పోరాడేందుకు వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ విధించడం ద్వారా దేశమంతా స్వచ్ఛంద ‘లాక్ డౌన్’ను ప్రకటించింది. కరోనా మూలంగా రానున్న ఆర్థిక కష్టాలను ఎదుర్కొనేందుకు కూడా ప్రజలు సిద్ధం కావాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా వైరస్‌ను ఓడించేందుకు దేశ ప్రజలు రానున్న ఆదివారం అంటే మార్చి 22 తేదీనాడు దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించాలని, ఉదయం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇళ్ల నుండి బయటకు రాకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు.