క్రీడాభూమి

మరో సమరానికి సై!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్: ఈ ఏడాది ఆరంభంలోనే ఆస్ట్రేలియా తో వనే్డ సిరీస్ నెగ్గిన కోహ్లీసేన తాజాగా న్యూజిలాండ్ పర్యటన లో సుదీర్ఘ క్రికెట్ ఆడనుంది. శుక్రవారం నుంచి ప్రారంభం కా నున్న టీ20 సిరీస్‌కు పూర్తిగా సన్నద్ధమైంది. మరోవైపు ఆస్ట్రేలి యాతో టెస్టు సిరీస్‌లో దారుణంగా ఓడిన న్యూజిలాండ్ జట్టు టీమిండియాపై గెలవాలనే కసితో రంగం సిద్ధం చేసుకుంది.
అన్ని సిరీస్‌ల్లో గెలుపే..
ప్రపంచకప్ తర్వాత భారత జట్టు ఆడిన అన్ని సిరీస్‌ల్లో విజ యం సాధించింది. వెస్టిండీస్ మొదలుకొని, వరుసగా దక్షిణాఫ్రి కా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆస్ట్రేలియాలపై గెలిచి మంచి ఊపుమీద కనిపిస్తోంది. అయతే ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో ఇదే కివీస్‌పై 18 పరుగుల తేడాతో టీమిండియా ఓడిన విషయాన్ని జట్టు తో పాటు అభిమానులెవ్వరూ ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నా రు. తాజా సిరీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. గత ఆస్ట్రేలియా సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఓ డిన భారత్, ఆ త ర్వాతి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే.
అన్ని విభాగాల్లో సమతూకంగా..
మరోవైపు టీమిండియా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తోంది. శ్రీలంకతో జరిగిన సిరీ స్‌కు దూరమైన ఓపెనర్ రోహిత్ శర్మ తిరిగి జట్టుతో చేరడంతో జట్టుకు మరింత బలం చేకూరినట్లయంది. అయతే గాయం కారణంగా శిఖర్ ధావన్ దూరం కావడంతో కేఎల్ రాహుల్‌తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. మూడో స్థానంలో కె ప్టెన్ విరాట్ కోహ్లీ, ఆ తర్వాతి స్థానాల్లో శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండేతో బ్యాటింగ్ లైనప్ దృఢంగా కనిపి స్తోంది. లోయర్ అర్డర్‌లో రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ కూడా జట్టు అవసరాన్ని బట్టి గతకొన్ని మ్యాచుల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే. అయతే గత సిరీస్‌ల్లో వరుసగా విఫల మవుతున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్ సిరీస్‌కు ఎంపికైనా, తుది జట్టులో చోటు కష్టంగా మారింది. ఆస్ట్రేలి యాతో సిరీస్‌లో కేఎల్ రాహుల్ అద్భుతంగా కీపింగ్ చేయడంతో రిషభ్ పంత్ తో పాటు మరో యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు చోటు కష్టమే. కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం రాహులే కీపింగ్ బాధ్యత లు నిర్వహిస్తాడని చెప్పడం విశేషం. ఇక టీ20 ప్రపంచకప్‌ను దృష్టి లో ఉంచుకొని మనీష్ పాండేకు జట్టు మేనేజ్‌మెంట్ అవకా శాలు ఇచ్చే అవకాశముంది.
బౌలింగ్‌పైనా దృష్టి..
ఎవరూ ఊహించని విధంగా కివీస్‌తో సిరీస్‌లో భారత జట్టు ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగే అవకాశముంది. పేస్ విభా గంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీతో పాటు శార్దుల్ ఠాకూర్ ఉండగా, స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్‌తో పాటు వాషింగ్టన్ సుందర్‌ను తీసుకునే అవకాశముం ది. ఇదిలాఉంటే జట్టు మేనేజ్‌మెంట్ రానున్న టీ20 ప్రపంచకప్ దృష్ట్యా ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
జట్ల అంచనా..
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, రిషభ్ పంత్, సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్.
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గుప్టిల్, రాస్ టేలర్, స్కాట్ కుగ్లిజైన్, కొలిన్ మున్రో, కొలిన్ డీ గ్రాండ్‌హోం, టామ్ బ్రూస్, డారియల్ మిచెల్, మిచెల్ శాంత్నార్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), హమీష్ బెనె్నట్, ఇష్ సోదీ, టిమ్ సౌథీ, బ్లేయర్ టిక్‌నర్.
'చిత్రం... టీ20 ట్రోఫీతో భారత్-న్యూజిలాండ్ జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్