క్రీడాభూమి

లంకదే తొలి టెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, జనవరి 23: జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక జట్టు 10 వికెట్ల తేడాతో చివరి రోజు విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 28 పరుగులతో ఐదో రోజు గురువారం సెకండ్ ఇన్నింగ్స్‌కు దిగిన జింబాబ్వే సురంగా లక్మల్, లహీరు కుమార ధాటికి 170 పరుగులకే ఆలౌటై, 13 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని లంక ముందుంచింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక కేవలం 3 ఓవర్లలోనే విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించిన ఎంజిలో మాథ్యూస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 27 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.

'చిత్రం...నాలుగు వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్ సురంగా లక్మల్