క్రీడాభూమి

కివీస్‌ను ప్రేమిస్తాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్, జనవరి 23: న్యూజిలాండ్ ఆటగాళ్లు చాలా మంచొళ్లని, వారితో ఆడడాన్ని మేం ఆస్వాదిస్తామని టీమిం డియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టుపై కోహ్లీ సేన 18 పరుగుల తేడాతో ఓడిపోయన సంగతి తెలిసిందే. అయతే అందుకు ప్రతీకారం తీర్చుకుం టారా? అని మీడియా ప్రతినిధులు అడగ్గా, న్యూజిలాండ్ ఆటగాళ్లతో ఆడితే అసలు ప్రతీకారమే తీర్చుకోవాలనిపించ దు. వారితో ఆడడాన్ని ఎప్పుడూ మేం అస్వాదిస్తాం అని పేర్కొన్నాడు. న్యూజిలాండ్ జట్టు చివరి వరకు మ్యాచ్‌ను గెలిచేలా ప్రయత్నం చేస్తుందని, ప్రపంచకప్‌లోనూ వారి ఆట తీరు మిగతా క్రికెట్ ఆడే అన్ని దేశాలకు ఆదర్శమని కొనియాడాడు. గతంలో మేం కూడా ఇ క్కడా కొన్ని మ్యాచ్ లు ఆడామని, అయతే సొంత గడ్డపై ఆడడం మాత్రం న్యూ జిలాండ్‌కు కలిసొచ్చే అంశమని కోహ్లీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇదిలాఉంటే టీమిండియా గురించి మాట్లా డుతూ ప్రస్తుతం జట్టులో కొంతమంది ఆటగాళ్లు గాయాల బారిన పడినా అత్యుత్తమ ఆటగాళ్లున్నారని పేర్కొన్నాడు.

'చిత్రం...టీమిం డియా కెప్టెన్ విరాట్ కోహ్లీ