క్రీడాభూమి

కుర్రాళ్లు కుమ్మేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓవల్: న్యూజిలాండ్‌తో సిరీస్‌ను భారత్ గెలుపుతో ఆరంభించింది. బుధవారం జరిగిన మొదటి అనధికార వనే్డలో కివీస్ ఏ జట్టుపై భారత్ ఏ విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన భారత్ న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిం ది. అయితే మొదటి వికెట్‌కు 51 పరుగులు జోడించిన కివీ ఓపెనర్లు జార్జ్ వర్కర్, రచిన్ రవీంద్ర జట్టుకు మంచి ఆరంభాన్ని అందిం చారు. అయితే మహ్మద్ సిరాజ్ వేసిన అద్భుత బంతికి జార్జ్ వర్కర్ (14) మొదటి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రచిన్ రవీంద్ర (49) విజయ్ శంకర్ బౌలింగ్ లో అవుటై, త్రుటిలో అర్ధ సెంచరీ చేసే అవకా శాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత కెప్టెన్ టామ్ బ్రూస్ (47), కోల్ మెకంజీ (34), గ్లేన్ ఫిలిప్స్ (24) మినహా మరెవరూ రాణించకపోవడంతో న్యూజిలాండ్ ఏ జట్టు 48.3 ఓవర్లలోనే 230 పరుగులకు కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ చెరో వికెట్లు తీశారు. విజయ్ శంకర్, రాహుల్ చాహర్‌లు కూడా ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఆడుతూ పాడుతూ..
మరోవైపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యా టింగ్‌కు దిగిన భారత్ ఏ జట్టు 29.3 ఓవర్లలో నే 5 వికెట్లు కోల్పోయ విజయం సాధించింది. భారత బ్యాట్స్‌మెన్లలో పృథ్వీ షా (48), మయాంక్ అగర్వాల్ (29), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (30), వికెట్ కీపర్ సంజూ శాంసన్ (39), సూర్యకుమార్ యాదవ్ (35) పరుగులు చేశారు.
'చిత్రం... మ్యాచ్‌కు ముందు భారత్ ఏ జట్టు