క్రీడాభూమి

హైదరాబాద్‌కు మరో ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెస్ట్ బెంగాల్, జనవరి 21: రంజీట్రోఫీలో భాగంగా బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు పరాజయం మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన బెంగాల్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లను కోల్పోయ 635 పరుగులు చేసిన విషయం తెలిసిందే. మనోజ్ తివారీ (303, నాటౌట్) ట్రిపుల్ సెంచరీ చేయగా, మజూందార్ (59), శ్రీవాత్స్ గో స్వామి (95), అర్నాబ్ నందీ (65, నాటౌట్), షెబాజ్ అమ్మద్ (49) రాణించారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌కు దిగిన హైదరాబాద్ 171 పరుగులకే ఆలౌట్ అయంది. జావేద్ అలీ (72) మాత్రమే అర్ధ సెంచరీతో రాణించాడు. 464 పరుగులఆ ధిక్యంలో ఉన్న బెంగాల్ జట్టు హైదరాబాద్‌ను ఫాలో ఆన్ ఆడించడంతో తిరిగి రెండో ఇన్నింగ్స్‌కు దిగగా, 161 పరుగులకే కుప్పకూలింది. తెలుకుపల్లి రవితేజ (53) మాత్రమే రాణించడంతో ఓటమి తప్పలేదు.