క్రీడాభూమి

సిక్సర్లు బాదిన సిమ్మన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బస్సెటెర్రె (సెయింట్ కిడ్స్ అండ్ నెవిస్), జనవరి 20: ఓపెనర్ లెండీ సిమ్మన్స్ సిక్సర్లతో విరుచుకుపడడంతో ఐర్లాండ్‌తో జరిగిన టీ 20 సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘనవిజయం సాధించింది. మొత్తం 10 సిక్సర్లు బాదిన సిమ్మన్స్ 90 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు. లెండీ సిమ్మన్స్ స్వయంగా వెస్టిండీస్ జట్టు కోచ్ పిల్ సిమ్మన్స్‌కు మేనల్లుడు. ఇతను కేవలం 40 బంతులు ఎదుర్కోగా అందులో ఐదు బౌండరీలు కూడా ఉన్నాయి. ఐర్లాండ్ జట్టు సాధించిన 139 పరుగులను 54 బంతులు మిగిలివుండగానే వెస్టిండీస్ చేధించింది. ఇర్లాండ్ ఆఫ్‌స్పిన్నర్ సిమీ సింగ్ వేసిన మూడు ఓవర్లలో సిమ్మన్స్ విరుచుపడడంతో 41 పరుగులు వచ్చాయి. ఇక సిమ్మన్స్‌తోబాటు బరిలోకి దిగిన మరో ఓపెనర్ ఎవిన్ లెవిస్ సైతం నాలుగు బౌండరీలు, ఓ సిక్సర్ బాది 46 పరుగులు సాధించాడు. కాగా తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ అనూహ్య విజయాన్ని నమోదు చేసి ఆధిపత్యాన్ని చాటగా తాజాగా 1-1తో సిరీస్ సమమైంది. గత ప్రపంచ కప్ పోటీల్లో తాను గాయం కారణంగా పాల్గొనలేక పోయినందుకు బాధగా ఉందని ఈ సందర్భంగా సిమ్మన్స్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
'చిత్రం...ఓపెనర్ లెండీ సిమ్మన్స్