క్రీడాభూమి

యువ క్రీడాకారులూ సుహృద్భావంతో మెలగండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 20: ‘యువత నాలుగు గోడల మధ్య బందీలై స్నేహితులతో కాలం వృథాచేస్తే జీవితాలను పాడుచేసుకున్నట్లే’నని తాజాగా అంతర్జాతీయ టెన్నిస్ రంగంనుంచి తప్పుకుంటున్న మాజీ ప్రపంచ నంబర్‌వన్ 29 ఏళ్ల కరోలిన్ వోజ్నియాక్కి సోమవారం నాడిక్కడ హెచ్చరించింది. అలాగే నేటి తరం యువ క్రీడాకారులు పరస్పరం సుహృద్భావంతో మెలగాలని సూచించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడిన తర్వాత రిటైర్‌కానున్నట్టు ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తొలి రౌండ్‌లో అమెరికాకు చెందిన క్రిస్టీ ఆన్‌ను 6-1, 6-3తో మట్టికరిపించిన అనంతరం ఈ డానిష్ స్టార్ వోజ్నియాక్కి మాట్లాడుతూ తనలో ఎన్నో ఉద్విగ్నతలున్నప్పటికీ వాటిని ఆటలో దరిచేరనీయనని, ప్రత్యేకించి ఈరోజు ఆటలో దాన్ని నియంత్రించడంలో పూర్తిగా విజయం సాధించానని భావిస్తున్నానంది. ప్రతి నిమిషాన్ని ఆస్వాదించడానికే తాను ప్రయత్నించానని పేర్కొంది. ఈ గేమ్‌ను తాను జీవితకాల స్నేహబంధాలతో ముగిస్తున్నందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించింది.