క్రీడాభూమి

హైదరాబాద్‌పై మనోజ్ తివారీ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెస్ట్ బెంగాల్, జనవరి 19: రంజీట్రోఫీలో భాగంగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ జట్టు మొదటి రోజు 5 వికెట్లు కోల్పోయ 366 పరుగులు చేసింది. అంతకు ముందు టాస్ గెలిచిన బెంగాల్ బ్యాటింగ్‌కు దిగింది. జట్టు స్కోరు 1 పరుగు వద్ద అభిషేక్ రామన్ (0) డకౌట్‌గా వెనుదిరగ్గా, కెప్టెన్ అభిమా న్యూ ఈశ్వరన్ (12), ఖాజీ సైఫీ (27) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఈక్రమంలో క్రీజులోకి వచ్చిన మనోజ్ తివారీ, అనుస్తుప్ మజుం దార్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని అందించారు.
ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధ సెంచరీ పూర్తిచేసుకోగా, కొద్దిసేపటికే మజుందార్ (59) అవుట్ మెహిడీ హసన్ బౌలింగ్‌లో స్టంప్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ శ్రీవాత్సవ్ గోస్వామితో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ దశలోనే తివారీ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అయతే మరోవైపు సెంచరీ 5 పరుగుల దూరంలో శ్రీవాత్సవ్ గోస్వామి (95) అవుటయ్యాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి మనోజ్ తివారీ (156, నాటౌట్), శ్రేయాన్ చక్రబొర్తి (0) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్ బౌలర్లలో రవికిరణ్‌కు 2 వికెట్లు పడగొట్టగా, తెలుకపల్లి రవితేజ, మెహిడీ హసన్, సాకేత్ సాయరాం ఒక్కో వికెట్ తీశారు.