క్రీడాభూమి

ధోనీపై వేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) పరోక్షంగా వేటు వేసింది. సెంట్రల్ కాంట్రాక్టులో చోటు ఇవ్వకుండా, రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకునేలా అతనిపై ఒత్తిడి పెంచింది. బోర్డు తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులో ‘ఏ’ ప్లస్ గ్రేడ్‌లో ముగ్గురు ఆటగాడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా తమతమ స్థానాలను కాపాడుకున్నారు. మూడు ఫార్మాట్స్‌లోనూ ఆడే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లకు కేటాయించిన ఈ గ్రేడ్‌లో ఉన్న వారికి ఏడు కోట్ల రూపాయలు లభిస్తాయి. గ్రేడ్ ‘ఏ’లో ఐదు కోట్లు, గ్రేడ్ ‘బీ’లో మూడు, గ్రేడ్ సీలో ఒక కోటి రూపాయలు చొప్పున దక్కుతాయి. కాగా, ఈసారి కాంట్రాక్టులు కోల్పోయిన వారిలో ధోనీతోపాటు అంబటి రాయుడు, దినేష్ కార్తీక్, ఖలీల్ అహ్మద్ తదితరులు కూడా ఉన్నారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మాయాంక్ అగర్వాల్‌కు గ్రేడ్ బీలో చోటు లభించడం విశేషం.
కాంట్రాక్టు పొందిన ఆటగాళ్ల వివరాలు..
గ్రేడ్ ‘ఏ’ ప్లస్ (7 కోట్ల రూపాయలు): విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా.
గ్రేడ్ ‘ఏ’ (5 కోట్ల రూపాయలు): రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శిఖర్ ధావన్, మహమ్మద్ షమీ, ఇశాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, రిషభ్ పంత్, లోకేష్ రాహుల్.
గ్రేడ్ ‘బీ’ (3 కోట్ల రూపాయలు): ఉమేష్ యాదవ్, యుజువేంద్ర చాహల్, హార్దిక్ పాండ్య, వృద్ధిమాన్ సాహా, మాయాంక్ అగర్వాల్.
గ్రేడ్ ‘సీ’ (కోటి రూపాయలు): కేదార్ జాదవ్, మనీష్ పాండే, హునుమ విహారీ, నవ్‌దీప్ సైనీ, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్.
ఈ కాంట్రాక్టులు గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు అమల్లో ఉంటాయి.
'చిత్రం...మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ