క్రీడాభూమి

నాదల్, బార్టీకి టాప్ సీడింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పురుషులు, మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్లు నొవాక్ జొకొవిచ్, నవమీ ఒసాకా తమతమ మొదటి రౌండ్ మ్యాచ్‌లను జాన్ లెనార్డ్ స్ట్ఫ్,్ర మేరీ బొజ్‌కొవాతో ఆడతారు. 20వ తేదీ నుంచి మొదలయ్యే ఈ మెగా టోర్నీ సీడింగ్స్‌లో మాత్రం రాఫెల్ నాదల్, ఆష్లే బార్టీ తమతమ విభాగాల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. తనకు అంతగా అచ్చిరాని ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఒకే ఒకసారి, 2009లో టైటిల్ సాధించిన నాదల్ ఈసారి తన ప్రయాణాన్ని హ్యూగో డెలియన్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలు పెడతాడు. ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించినప్పటికీ, అతను ఎంత వరకూ టైటిల్ పోరులో నిలుస్తాడన్నది అనుమానమే. అయితే, కెరీర్‌లో ఇప్పటికే 19 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను అందుకున్న నాదల్ ఈసారి విజేతగా నిలిస్తే, 20 టైటిళ్లతో రోజర్ ఫెదరర్ సరసన చోటు సంపాదిస్తాడు. కాగా, ఆష్లే బార్టీ మహిళల విభాగంలో నంబర్ వన్‌గా ఉన్నప్పటికీ, డిఫెండింగ్ చాంపియన్ ఒసాకా నుంచి తీవ్రమైన పోటీ తప్పదు. పురుషుల విభాగంలో రోజర్ ఫెదరర్, డానిల్ మెద్వెదెవ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ వంటి హేమీహేమీలు టైటిల్‌పై కనే్నశారు. మహిళల సింగిల్స్‌లో సీనియర్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ స్టార్ అట్రాక్షన్‌గా నిలవనుంది. 2017లో ఈ టోర్నమెంట్ ఆడే సమయానికే ఆమె గర్భవతి. అప్పుడు టైటిల్ సాధించిన తర్వాత ఆమె తాను తల్లిని కాబోతున్నట్టు ప్రకటించి, యావత్ క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. అమ్మాయికి జన్మనిచ్చిన తర్వాత కొంత కాలం విశ్రాంతి తీసుకున్న సెరెనా మళ్లీ కెరీర్‌ను కొనసాగించినప్పటికీ, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, తాజాగా ఆక్లాండ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకోవడం ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేయడానికి కెరీర్‌లో 24వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌పై కనే్నసిన ఆమె తన గమ్యాన్ని చేరుకుంటుందా అన్నది ఆసక్తి రేపుతున్నది. ఆమె తన ప్రస్థానాన్ని 90వ ర్యాంక్ క్రీడాకారిణి అనస్తాషియా పొటపొవాతో జరిగే మ్యాచ్‌తో మొదలు పెడుతుంది. ఇలావుంటే, 38 ఏళ్ల వెటరన్ ఆటగాడు ఫెదరర్ తన తొలి రౌండ్‌లో అమెరికాకు చెందిన స్టీవ్ జాన్సన్‌ను ఢీ కొంటాడు. మహిళల ప్రపంచ నంబర్ వన్ బార్టీ తన తొలి మ్యాచ్‌లో ఉక్రెయిన్ క్రీడాకారిణి లెసియా సురెన్కొతో తలపడుతుంది.
‘టాప్-10’ సీడింగ్స్
పురుషుల విభాగం: 1. రాఫెల్ నాదల్, 2. నొవొక్ జొకొవిచ్, 3. రోజర్ ఫెదరర్, 4. డానిల్ మెద్వెదెవ్, 5. డామినిక్ థియేమ్, 6. స్ట్ఫోనొస్ టిప్సిపాస్, 7. అలెగ్జాండర్ జ్వెరెవ్, 8. మాటెయో బెరెట్టినీ, 9. రాబర్టొ బటిస్టా అగుట్, 10. గేల్ మోన్ఫిల్స్.
మహిళల విభాగం: 1. ఆష్లే బార్టీ, 2. కరొలినా ప్లిస్కోవా, 3. నవోమీ ఒసాకా, 4. సిమోనా హాలెప్, 5. ఎలినా స్విటోలినా, 6. బెలిండా బెన్సిక్, 7. పెట్రా క్విటోవా, 8. సెరెనా విలియమ్స్, 9. కికీ బెర్టెన్స్, 10. మాడిసన్ కీస్.
''చిత్రాలు.. టాప్ సీడింగ్స్ రాఫెల్ నాదల్, ఆష్లే బార్టీ

*పురుషులు, మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్లు నొవాక్ జొకొవిచ్, నవమీ ఒసాకా