క్రీడాభూమి

ఆస్ట్రేలియాలో ఎక్కడైనా డే అండ్ నైట్ మ్యాచ్‌లకు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 13: ఆస్ట్రేలియా గడ్డలోని ఏ ప్రాంతంలోనైనా ఆ దేశ జట్టుతో డే అండ్ నైట్ మ్యాచ్‌లు ఆడేందుకు తాము సిద్ధమేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. కొన్ని నెలల కిందట ఆసిస్ క్రికెటర్ టిమ్ పైన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోహ్లీ పైవిధంగా స్పందించాడు. ఆస్ట్రేలియాలో ఆ దేశ జట్టుతో ఎక్కడ డే అండ్ నైట్ మ్యాచ్ నిర్వహించినా ఈ ఏడాది తర్వాత తాము సంసిద్ధంగా ఉంటామని స్పష్టం చేశాడు. ఆసిస్‌తో భారత్ మంగళవారం నుంచి జరుగనున్న మూడు వనే్డ మ్యాచ్‌లలో తలపడనుంది. ఈ వనే్డ సిరీస్ ప్రారంభానికి ముందు ఇక్కడ మీడియాతో మాట్లాడిన కోహ్లీ ‘సవాళ్లను స్వీకరించేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధమే. అది గబ్బా స్టేడియం కావచ్చు.. పెర్త్ స్టేడియం కావచ్చు.. ఏ స్టేడియం అయినా సమస్య లేదు. ఎక్కడైనా ఆసిస్ జట్టుతో ఆ దేశంలోనే డే అండ్ నైట్ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నాడు. గత ఏడాది నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తాము డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ను ఆడిన విషయాన్ని, అందులో సాధించిన భారత్ సాధించిన విజయాన్ని ఈ సందర్భంగా కోహ్లీ ప్రస్తావించాడు. ‘ఇక్కడ డే అండ్ నైట్ టెస్టు సిరీస్ ఆడాం. సిరీస్ ఆసాంతం ఎంతో ఆనందించాం. ఇదే స్ఫూర్తితో ప్రపంచంలోని ఏ ప్రాంతంలో, ఏ మైదానంలో డే అండ్ నైట్ సిరీస్‌లు జరిగినా మేం సిద్ధమే. అది వైట్ బాల్ కావొచ్చు, రెడ్ బాల్ కావొచ్చు, పింక్ బాల్ కావొచ్చు. ఏ బాల్ అయినా ఆడేందుకు టీమిండియా జట్టు రెడీగా ఉంది’ అని కెప్టెన్ కోహ్లీ స్పష్టం చేశాడు. కాగా, ఆస్ట్రేలియా వచ్చే ఏడాది వేసవి సీజన్‌లో భారత్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఈ టెస్టు మ్యాచ్‌లు జరుగనున్నాయి. గత ఏడాది స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన డే అండ్ టెస్టు మ్యాచ్‌లో గెలుపొందిన అనందంతో తమ జట్టులో మరింత ఆత్మవిశ్వాసం పెంపొందిందని, ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఆసిస్‌తో ఆ దేశంలో డే అండ్ టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు తయారుగా ఉన్నామని కోహ్లీ పేర్కొన్నాడు.
'చిత్రం...టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ