క్రీడాభూమి

పాకిస్తాన్, శ్రీలంక చారిత్రక టెస్టు డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావల్పిండి, డిసెంబర్ 15: పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన చారిత్రక తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2009 మార్చి 3న పాకిస్తాన్ టూన్‌లో ఉన్న లంక క్రికెటర్లపై లాహోర్‌లో ఉగ్రవాద దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆతర్వాత ప్రపంచ దేశాలేవీ పాక్‌లో పర్యటించలేదు. జింబాబ్వే, కెన్యా తప్ప ఆ దేశంతో ఇప్పటి వరకూ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు ఏ జట్టూ ముందుకు రాకపోవడంతో, పాక్ తన సిరీస్‌లను తటస్థవేదికలపై ఆడుతున్నది. దేశంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పలు రకాలుగా ప్రయత్నాలు చేసింది. విదేశీ క్రికెటర్ల భద్రతకు అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నట్టు పదేపదే ప్రకటించింది. ఎన్నో అభ్యర్థనల తర్వాత పాక్‌లో పర్యటించడానికి శ్రీలంక అంగీకరించడంతో, ఈ సిరీస్‌కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. దశాబ్దం తర్వాత శ్రీలంక మళ్లీ పాక్ గడ్డపై అడుగుపెట్టి, మిగతా దేశాలకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని అందిస్తున్నది. పాక్‌కు ఎంతో కీలకంగా మారిన ఈ మ్యాచ్‌కి వర్షం వల్ల పదేపదే అంతరాయం ఏర్పడింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ పూర్తికాగా, మ్యాచ్ డ్రాగా ముగిసే సమయానికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 252 పరుగులు చేసింది. అబిత్ అలీ, బాబర్ ఆజమ్ అజేయ శతకాలతో రాణించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంక మొదటి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్: 97 ఓవర్లలో 6 వికెట్లకు 308 డిక్లేర్డ్ (కరుణరత్నే 59, ఒషాడా ఫెర్నాండో 40, ధనంజయ డి సిల్వ 102, నిరోషన్ డిక్వెల్లా 33, షహీన్ అఫ్రిదీ 2/58, నసీమ్ షా 2/92).
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్: 70 ఓవర్లలో 2 వికెట్లకు 252 (అబిద్ అలీ 109 నాటౌట్, అజర్ అలీ 36, బాబర్ ఆజమ్ 102 నాటౌట్).