క్రీడాభూమి

ఆసీస్ చేతిలో కివీస్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, డిసెంబర్ 15: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఏకంగా 296 పరుగుల తేడాతో చిత్తయింది. అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన ఆసీస్ సులభంగానే విజయాన్ని నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన మిచెల్ స్టార్క్ రెండో ఇన్నింగ్స్‌లో మరో నాలుగు వికెట్లు సాధించి, టిమ్ పైన్ నేతృత్వంలోని ఆసీస్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ కేవలం నాలుగు రోజుల్లోనే ముగియడం విశేషం. ఆరు వికెట్లకు 167 పరుగుల స్కోరువద్ద నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌ను తొమ్మిది వికెట్లకు 217 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని ప్రత్యర్థి ముందు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అసాధ్యంగా కనిపిస్తున్న ఈ స్కోరును అందుకునేందుకు ఏ మాత్రం ప్రయత్నం చేయని కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే కుప్పకూలింది. ఈ టెస్టులో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే ఆలౌటైంది.

సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 146.2 ఓవర్లలో 416 ఆలౌట్ (మార్నస్ లబుషేన్ 143, ట్రావిస్ హెడ్ 58, స్టీవెన్ స్మిత్ 43, డేవిడ్ వార్నర్ 43, టిమ్ సౌథీ 4/93, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 4/92).
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్: 55.2 ఓవర్లలో 166 ఆలౌట్ (కేన్ విలియమ్‌సన్ 34, రాస్ టేలర్ 80, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 23, మిచెల్ స్టార్క్ 5/52, నాథన్ లియాన్ 2/48).
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 69.1 ఓవర్లలో 9 వికెట్లకు 217 డిక్లేర్డ్ (జో బర్న్స్ 53, మార్నస్ లబుషేన్ 50, టిమ్ సౌథీ 5/69, నీల్ వాగ్నర్ 3/59).
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 468): 65.3 ఓవర్లలో 171 ఆలౌట్ (బీజే వాల్టింగ్ 40, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 33, మిచెల్ స్టార్క్ 4/45, నాథన్ లియాన్ 4/63, పాట్ కమిన్స్ 2/31).
*చిత్రం... తొలి టెస్టు నాలుగు రోజు ఆటలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఔటైనప్పుడు ఆస్ట్రేలియా క్రికెటర్ల ఆనందం