క్రీడాభూమి

రికార్డుపై కోహ్లీసేన కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: టీ20 సిరీస్‌ను గెలుచుకున్న కోహ్లీసేన నేటి నుంచి వెస్టిండీస్‌తో జరిగే వనే్డ సిరీస్‌పై కనే్నసింది. ద్వైపాక్షిక సిరీస్‌ను ఇప్పటికే తొమ్మిదిసార్లు గెలుచుకున్న భారత్, ఈ సిరీస్‌నూ గెలిచి సరికొత్త రికార్డును సాధించేందుకు ఉవ్విళ్లూరుతోంది. ప్రపంచకప్ తర్వాత విండీస్‌లో పర్యటించిన కోహ్లీసేన వనే్డ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సొంతగడ్డపైనా కరేబియన్లను మట్టికరిపించాలని భావిస్తోంది. మరోవైపు గత పొట్టి ఫార్మాట్‌లో మొదటి టీ20లో చిత్తుగా ఓడి, రెండో టీ20లో గర్జించి, నిర్ణయాత్మక మూడో టీ20లో పోరాడి ఓడిన విండీస్ జట్టు వనే్డ సిరీస్‌ను గెలిచి టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.
జట్టులోకి మయాంక్? శార్దుల్..
మరోవైపు భారత జట్టు రెగ్యూలర్ ఓపెనర్ శిఖర్ ధావన్ మోకాలి గాయం కారణంగా గత కొద్దిరోజులుగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వనే్డ సిరీస్‌కు కోలుకుంటాడని భావించినా, అది సాధ్యపడకపోవడంతో జట్టులోకి కర్నాటక యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయతే ఇటీవల జరిగిన టెస్టుల్లో అద్భుతంగా రాణించిన మయాంక్ వనే్డల్లోనూ సత్తా చాటేందుకు తహతహలాడుతున్నా డు. అయతే ఓపెనర్‌గా ప్రస్తుతం జట్టులో కేఎల్ రాహుల్ రాణిస్తుండడంతో మయాంక్‌కు చోటు కాస్త అనుమానంగానే కనిపిస్తోంది. ఒకవేళ రాహుల్‌ను మిడిలార్డర్‌కి పంపిస్తేనే అది సాధ్యమవుతోంది. ఇప్పటికే మూడో స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ రాణిస్తుం తడడంతో తుది జట్టులో మయాంక్‌కు చోటుపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కి ఈ సిరీస్ చాలా కీలకంగా మారనుంది. గత కొద్దిరోజులుగా రిషభ్ జట్టు మేనేజ్‌మెంట్ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగించుకోవడం లో పూర్తిగా విఫలమవుతున్నాడు. ప్రతిసారీ ఒకే విధంగా అవు ట్ కావడం, షాట్ల ఎంపికలోనూ స్పష్టత లేకపోవడంతో మేనేజ్ మెంట్‌తో పాటు అభిమానులు పంత్ ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోచ్ రవిశాస్ర్తీ మాట్లాడుతూ రాహుల్‌తో కీపింగ్ సైతం చేయస్తా మని అన్న మాటాలు ఇందు కు నిదర్శనంగా మారాయ. ఇదిలాఉంటే పేసర్ భువనేశ్వర్ కుమార్ సైతం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో ముంబయకి శార్దుల్ ఠాకూర్‌కి సెలక్టర్లు అవకాశమిచ్చారు. మహ్మద్ షమీ శార్దుల్‌తో కలిసి బంతిని పంచుకోనున్నాడు. వీరిద్దరితో పాటు దీపక్ చాహర్ ఉండగా, కొంత విరామం తర్వాత యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ లు జట్టులో చోటు దక్కించుకున్నారు. చెన్నై పిచ్ స్లో బౌలింగ్‌కు అనుకూలించడంతో వీరిద్దరి పాత్ర సిరీస్‌లో ప్రధానం కానుంది. మరోవైపు టీ20 సిరీస్‌ను కోల్పోయన కీరన్ పొలార్డ్ సేన వనే్డ సిరీస్‌ను చేజిక్కించుకొని పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.
*చిత్రం...విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్