క్రీడాభూమి

టాప్ -10లో విరాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20ల్లో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మొదటి ర్యాంకులో కొనసాగుతున్న కోహ్లీ, పొట్టి క్రికెట్‌లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలతో పాటు మొత్తం 183 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. దీంతో తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 5 స్థానాలను ఎగబాకి టాప్-10 లో చోటు దక్కించుకున్నాడు. విరాట్‌తో పాటు టీమిండియాకే చెందిన కేఎల్ రాహుల్ 734 రేటింగ్ పాయింట్లతో మూడు స్థానాలు అధిగమించి 6వ స్థానంలో చోటు దక్కించుకోగా, ఓపెనర్ రోహిత్ శర్మ 686 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతున్నాడు.
పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజాం 879 రేటింగ్ పాయంట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ 810 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక వెస్టిండీస్ నుంచి ఎవిన్ లూయస్ 699 రేటింగ్ పాయింట్లతో 7వ స్థానాన్ని పదిలం చేసుకు న్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా (5), రవిచంద్రన్ అశ్విన్ (9), మహ్మద్ షమీ (10) టాప్-10లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (2), రవిచంద్రన్ అశ్విన్ (5) టాప్ 10లో ఉన్నారు.
*చిత్రాలు.. రోహిత్ శర్మ
*విరాట్ కోహ్లీ
*కేఎల్ రాహుల్