క్రీడాభూమి

లబూస్‌ఛేంజ్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, డిసెంబర్ 12: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మొదటి రోజు ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయ 248 పరుగు లు చేసింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడే ప్రయత్నం చేసింది. అయితే జట్టు స్కోరు 40 పరుగుల వద్ద ఓపెనర్ జో బర్న్స్ (9) డీగ్రాండ్ హోం బౌలింగ్‌లో మొదటి వికెట్‌గా అవుట య్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లబూ స్‌ఛేంజ్‌తో వార్నర్‌తో జతకట్టాడు. వీరిద్దరూ కొద్దిసేపు కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈక్రమంలో వార్నర్ (43) వాగ్నర్ వేసిన అద్భుత బంతికి అతడికు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్‌తో కలిసి లబూస్ ఛేంజ్ న్యూజిలాండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. ఈ దశలో అర్ధ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. స్మిత్ సైతం ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించా డు. అయతే మిచెల్ శాంత్నార్ వేసిన 74వ ఓవర్‌లో 2 బంతిని సిక్సర్‌గా మలిచిన లబూ స్‌ఛేంజ్ తన కెరీర్‌లో మూడో సెంచరీ సాధిం చాడు. మరోవైపు స్మిత్ (43) అర్ధ సెంచరీకి చేరువలో వాగ్నర్ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి క్రీజును వదిలాడు. మాథ్యూ వేడ్ (12) నిరాశ పరిచాడు. తొలి రోజు ఆట ముగిసే సమ యానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. క్రీజులో లబూస్‌ఛేంజ్ (110), ట్రావిస్ హెడ్ (20) ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో నెల్ వాగ్నర్‌కు 2 వికెట్లు పడగా, టిమ్ సౌథీ, కొలిన్ డీగ్రాండ్ హోం ఒక్కో వికెట్ తీసుకున్నారు.

*చిత్రం... లబూస్‌ఛేంజ్ (110)