క్రీడాభూమి

నాన్న కష్టమే నన్ను నిలబెట్టింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 3: తన తండ్రి నరేష్ గార్గ్ కష్టమే తనను నిలబెట్టిందని, త్యాగమే తనను ఈ స్థితిలో ఉంచిందని భారత అండర్-19 జట్టు కెప్టెన్ ప్రియమ్ గార్గ్ అన్నాడు. మంగళవారం అతను పీటీఐతో మాట్లాడుతూ, స్కూల్ వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్న తన తండ్రి ఎంతో కష్టపడి క్రికెట్‌లో తన ఎదుగుదలకు తోడ్పడ్డాడని అన్నాడు. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు దక్షిణాఫ్రికాలో జరిగే అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు తనను కెప్టెన్‌గా నియమించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. మీరట్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని క్విలా పరీక్షిత్‌గఢ్ గ్రామానికి చెందిన ప్రియమ్ తన ఆరేళ్ల ప్రాయం నుంచే క్రికెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. తన తండ్రి స్కూల్ వాన్ డ్రైవర్‌గా పని చేస్తూ, కుటుంబ పోషణ కోసం ఎంతో కష్టపడేవాడని ప్రియం తన ఇంటర్వ్యూలో తెలిపాడు. తనకు ఒక అన్న, ముగ్గురు అక్కలు ఉన్నారని, కుటుంబంలో తానే చిన్నవాడినని చెప్పాడు. క్రికెట్ పట్ల తనకు ఉన్న మక్కువను గమనించి, శిక్షణ ఇప్పించాడని తెలిపాడు. తండ్రితోపాటు కుటుంబంలోని సభ్యులంతా తనకు అండగా నిలిచారని, లేకపోతే, తాను భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యే వాడిని కానని చెప్పాడు. తన 11వ ఏటే తల్లిని కోల్పోయానని, ఆ తర్వాత కుటుంబ పరిస్థితులు ఒడిదుడుల్లో పడినప్పటికీ, తన తండ్రి అండగా నిలిచాడని చెప్పాడు. అండర్-19 ప్రపంచ కప్‌లో జట్టుకు అత్యుత్తమ సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రీతం అన్నాడు. తనపై ఎలాంటి ఒత్తిడి లేనది, టోర్నీలో స్వేచ్ఛగా ఆడతానని తెలిపాడు.

*చిత్రం...భారత అండర్-19 కెప్టెన్ ప్రియమ్ గార్గ్