క్రీడాభూమి

క్రీడాకారుల చేయూతకు ప్రత్యేక పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 600 మందికి పైగా విశ్రాంత క్రీడాకారులు జీవితకాల నెలవారీ పింఛన్లు అందుకుంటున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు సోమవారం నాడిక్కడ లోక్‌సభకు తెలిపారు. ఇలా పింఛన్ పొందుతున్న వారిలో ఒలింపిక్స్, ఆసియా, కామన్‌వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించినవారు కూడా ఉన్నారని, కేంద్ర ప్రభుత్వ ‘పెన్షన్ టు మెరిటోయస్ స్పోర్ట్స్ పర్సన్స్’ పథకం ద్వారా ఈ పింఛన్లు అందజేయడం జరుగుతోందని వివరించారు. పేదరికంలో మగ్గుతున్న క్రీడాకారుల విషయం తమ మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చిందని, అలాంటివారికి చేయూతనిచ్చేందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి రిజ్జు సభకు వివరించారు. ప్రపంచ చాంపియన్ల సహా వివిధ జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన మొత్తం 627 మంది క్రీడాకారులకు జీవితకాల నెలవారీ పింఛన్లు రూ. 12,000 నుంచి రూ. 20,000 వరకు అందజేస్తున్నట్టు తెలిపారు. అలాగే మరో అనుబంధ ప్రశ్నకు రిజ్జూ సమాధానమిస్తూ ప్రతి రాష్ట్రంలో క్రీడలకు కనీస సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు ఉందన్నారు. స్మోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ) తన పరిధిలో అందరు క్రీడాకారులకు, అక్రిడేటెడ్ కోచ్‌లకు తగిన సదుపాయాలను ఉచితంగా అందజేస్తుందని మంత్రి సభకు తెలిపారు. వీరికి క్రీడా స్టేడియంలను వినియోగించుకునేందుకు ఒక్క రూపాయి కూడా చార్జి చేయడం లేదని స్పష్టం చేశారు.
ఇది ఓ విప్లవాత్మక నిర్ణయమని, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమవంతు ఉచిత సదుపాయాలను క్రీడాకారులకు కల్పించి ప్రోత్సహించాల్సి అవసరం ఉందని రిజ్జు పేర్కొన్నారు. అలాగే క్రీడాకారులకు సహకారం అందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ రంగ సంస్థలను సైతం కోరిందన్నారు.