క్రీడాభూమి

ఓటమి అంచున పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండవ, చివరి టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి అంచున నిలిచింది. మూడో రోజు వర్షం కారణంగా ఆటను నిర్ణీత సమయాని కంటే ముందుగానే నిలిపివేయగా, అప్పటికి తన రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి, ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదంలో పడింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగా, చేతిలో ఉన్న ఏడు వికెట్లతో పరాజయం నుంచి బయటపడే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. డే/నైట్ ఈవెంట్‌గా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లకు 96 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో, మూడో రోజు, ఆదివారం ఉదయం ఆటను కొనసాగించిన పాక్ యాసిర్ షా వీరోచిత సెంచరీ కారణంగా కొంత వరకూ కోలుకుంది. ఏడో వికెట్‌కు యాసిర్ షాతో కలిసి 105 పరుగులు జోడించిన బాబర్ ఆజం 97 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద, పిచ్ స్టార్క్ బౌలింగ్‌లో టిమ్ పైన్ క్యాచ్ అందుకోగా ఔటయ్యాడు. మూడు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్న అతను తీవ్ర నిరాశతో మైదానం నుంచి వెనుదిరిగాడు. తర్వాతి బంతికే షహీన్ అఫ్రిదీ పరుగుల ఖాతా తెరవకుండానే, ఎల్‌బీగా పెవిలియన్ చేరాడు. మహమ్మద్ అబ్బా 29 పరుగులు చేసి, పాట్ కమిన్స్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ చక్కటి క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. అతను యాసిర్ షా సెంచరీకి చక్కటి సహకారాన్ని అందించాడు. చివరి వరకూ అద్భుత పోరాటాన్ని కొనసాగించి, 213 బంతులు ఎదుర్కొని, 13 ఫోర్లతో 113 పరుగులు చేసిన యాసిర్ షాను నాథన్ లియాన్ క్యాచ్ పట్టగా పాట్ కమిన్స్ ఔట్ చేయడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌కు 94.4 ఓవర్లలో 302 పరుగుల వద్ద తెరపడింది.
తప్పని ఫాలోఆన్..
మొదటి ఇన్నింగ్స్‌లో 287 పరుగులు వెనుకబడిన పాకిస్తాన్‌కు ఫాలోఆన్ తప్పలేదు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 3 వికెట్లకు 589 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. పాక్ మొదటి ఇన్నింగ్స్‌కు 302 పరుగుల వద్ద తెరపడడంతో, ఆసీస్ ఆహ్వానం మేరకు రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. జట్టు స్కోరు కేవలం రెండు పరుగుల వద్ద, జొస్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో ఇమాముల్ హక్ (0) ఎల్‌బీగా వెనుదిగాడు. కెప్టెన్ అజర్ అలీ 9 పరుగులు చేసి, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లోనే స్టీవెన్ స్మిత్‌కు చిక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీని తృటిలో కోల్పోయిన బాబర్ ఆజం 8 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద జొస్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో టిమ్ పైన్ క్యాచ్ అందుకోగా ఔటయ్యాడు. బంతి ఏ దిశగా, ఎంత వేగంతో దూసుకొస్తుందో అంచనా వేయడం కూడా కష్టంగా మారిన నేపథ్యంలో, మరిన్ని వికెట్లు కూలే ప్రమాదం కనిపించింది. అయితే, వర్షం కురవడంతో, మూడో రోజు ఆటను ముగిస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. అప్పటికి పాక్ తన తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 248 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి. రెండు రోజుల ఆట మిగిలి ఉన్న తరుణంలో, పాక్ ఓటమి ఖాయంగా కనిపిస్తున్నది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, ఇప్పటికే మొదటి టెస్టును గెల్చుకున్న ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకూ వరుసగా 13 టెస్టు మ్యాచ్‌లను కోల్పోయిన పాక్ మరోసారి పరాభవాన్ని మూటకట్టుకోనుంది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 127 ఓవర్లలో 3 విక్లెకు 589 (డేవిడ్ వార్నర్ 335 నాటౌట్, మార్నస్ లబుషెన్ 162, స్టీవెన్ స్మిత్ 36, మాథ్యూ వేడ్ 38 నాటౌట్, షహీన్ అఫ్రిదీ 3/88).
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్: 94.4 ఓవర్లలో 302 ఆలౌట్ (బాబర్ ఆజం 97, యాసిర్ షా 113, మిచెల్ స్టార్క్ 6/66, పాట్ కమిన్స్ 3/83).
పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ (్ఫలోఆన్): 16.5 ఓవర్లలో 3 వికెట్లకు 39 (షాన్ మసూద్ 14 నాటౌట్, అసద్ షఫీక్ 8 నాటౌట్, జొస్ హాజెల్‌వుడ్ 2/15, మిచెల్ స్టార్క్ 1/10).
*చిత్రాలు.. 113 పరుగులు చేసిన యాసిర్ షా
*మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న బాబర్ ఆజం