క్రీడాభూమి

‘కూలింగ్ ఆఫ్’ పై నీళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 1: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తీరు మళ్లీ మొదటి వస్తున్నట్టు కనిపిస్తున్నది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన లోధా కమిటీ అనేకానేక అశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇచ్చిన నివేదికలోని అంశాలను నీరుగార్చే ప్రయత్నానికి మళ్లీ శ్రీకారం చుట్టింది. అందులో పేర్కొన్న ప్రతి అంశాన్నీ తు.చ తప్పకుండా అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడమేగాక, ఇందు కోసం పాలనాధికారుల బృందాన్ని (సీఓఏ) నియమించింది. నిజానికి వీరి ఆధ్వర్యంలోనే ఇంత వరకూ బోర్డు కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయితే, పదవీ కాలానికి సంబంధించి లోధా కమిటీ సిఫార్సు చేసిన అంశాలు, ప్రధానంగా 3కూలింగ్ ఆఫ్2ను మార్చాలని ఇక్కడ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో తీర్మానించింది. ఈ నిర్ణయాల కాపీని ఆమోదం కోసం సుప్రీం కోర్టుకు పంపింది. స్థానిక క్రికెట్ బోర్డుల నుంచి బీసీసీఐ వరకూ ఎక్కడైనా సరే, కార్యవర్గంలో మూడేళ్లకు మించి పని చేయడానికి వీల్లేదు. ఒక వ్యక్తి వరుసగా రెండు పర్యాయాలు ఎన్నిక కావచ్చు. అంటే ఏకబిగిన ఆరు సంవత్సరాలు క్రికెట్ సంఘాలు లేదా బోర్డు కార్యవర్గంలో ఉండవచ్చు. ఆ తర్వాత కనీసం మూడేళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలి. దీనినే 3కూలింగ్ ఆఫ్2 కాలంగా లోధా కమిటీ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. ఆతర్వాత మరోసారి మాత్రమే సదరు వ్యక్తి క్రికెట్ సంఘాలు లేదా బీసీసీఐ కార్యవర్గానికి ఎన్నిక కావచ్చు. స్థూలంగా చెప్పాలంటే, మొత్తం మూడు పర్యాయాలు, వరుసగా ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఎవరూ క్రికెట్ పాలక వర్గం వర్గాల్లో ఉండకూడదు. రెండు పర్యాయాలు పాలక మండలిలో ఉంటే, ఆతర్వాత కూలింగ్ పీరియడ్ మొదలవుతుంది. ఈ అంశమే బోర్డుకు నచ్చడం లేదు.
గంగూలీ ఎత్తుగడ!
3కూలింగ్ ఆఫ్2 నిబంధనను తొలగించాలంటూ బీసీసీఐ తీర్మానాన్ని ఆమోదించడం ఇటీవల బోర్డుకు అధ్యక్షుడిగా ఎన్నికైన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎత్తుగడగానే కనిపిస్తున్నది. బెంగాల్ క్రికెట్ సంఘం (సీఏబీ) అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ ఆతర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, వరుసగా ఆరు సంవత్సరాలు ఒక పదవిలో ఉన్న తర్వాత 3కూలింగ్ ఆఫ్2 అమలవుతుంది. దీని ప్రకారం అతను వచ్చే ఏడాది తన పదవి నుంచి తప్పుకోవాలి. అందుకే, ఈ నిబంధనను మార్చాలని లేదా ఎత్తివేయాలని బీసీసీఐ తీర్మానాన్ని ఆమోదించేలా చూశాడన్నది వాస్తవం. సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందిస్తూ, 2024 వరకూ అతడను బోర్డు అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సుప్రీం కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.

*చిత్రం... సౌరవ్ గంగూలీ