క్రీడాభూమి

బర్న్స్, రూట్ శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, డిసెంబర్ 1: ఓపెనర్ రొరీ బర్న్స్, కెప్టెన్ జో రూట్ శతకాలతో చెలరేగడంతో, న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటను వర్షం కారణంగా నిర్ణీత సమయాని కంటే ముందుగానే ముగించే సమయానికి ఇంగ్లాండ్ 5 వికెట్లకు 269 పరుగులు చేయగలిగింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 375 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు, శనివారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఉదయం ఆటను కొనసాగించి, 201 పరుగుల వద్ద బర్న్స్ వికెట్‌ను కోల్పోయింది. 209 బంతులు ఎదుర్కొని, 15 ఫోర్లతో 101 పరుగులు చేసిన అతను దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. స్టార్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్ 59 బంతుల్లో 26 పరుగులు చేసి, టిమ్ సౌథీ బౌలింగ్‌లో రాస్ టేలర్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. జాక్ క్రాలే కేవలం ఒక పరుగు చేసి, నీల్ వాగ్నర్ బౌలింగ్‌లో జేబీ వాల్టింగ్‌కు దొరికిపోయాడు. 99.4 ఓవర్ల వద్ద వర్షం కారణంగా నిలిచిపోయిన ఆటను కొనసాగించే అవకాశం లభించలేదు. దీనితో ఆటను ముగిస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. అప్పటికి రూట్ 114, ఒలీ పోప్ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రూట్ 278 బంతులు ఎదుర్కొన్నాడు. అతని స్కోరులో 14 ఫోర్లు ఉన్నాయి.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 129.1 ఓవర్లలో 375 ఆలౌట్ (టామ్ లాథమ్ 105, రాస్ టేలర్ 53, బీజే వాల్టింగ్ 55, డెరిల్ మిచెల్ 73, స్టువర్ట్ బ్రాడ్ 4/73, క్రిస్ వోక్స్ 3/83, శామ్ క్యూరెన్ 2/63).
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్: 99.4 ఓవర్లలో 5 వికెట్లకు 269 (రొరీ బర్న్స్ 101, జో రూట్ 114 నాటౌట్, బెన్ స్టోక్స్ 26, టిమ్ సౌథీ 2/63, నీల్ వాగ్నర్ 1/76).