క్రీడాభూమి

వార్నర్.. సూపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడిలైడ్: పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో సొంతగడ్డపై కంగారులు అదరగొడుతున్నారు. ప్రత్యర్థి జట్టును అన్ని విభాగాల్లో చిత్తు చేస్తూ తమ ఆధిప త్యాన్ని కొనసాగిస్తున్నారు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇప్పటికే ఓ విజయం సాధించిన ఆస్ట్రేలియా చివరిదైన రెండో టెస్టులోనూ పట్టు బిగించింది. ఓవర్ నైట్ స్కోరు 302/1తో శనివారం మొదటి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసిస్ పాకిస్తా న్ బౌలర్లకు ఎలాంటి అవకాశమివ్వకుండా ఆడింది. శుక్రవారం సెంచరీలు సాధించి బ్యాటింగ్‌ను కొనసాగించిన డేవిడ్ వార్న ర్, మమూస్ లబూస్‌ఛేంజ్ అదే ఫాంను ప్రదర్శించారు. ఈ క్రమంలో లబూస్‌ఛేంజ్ (162) షాహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో వీరిద్దరూ భాగస్వా మ్యానికి తెర పడింది. రెండో వికెట్‌కు వార్నర్, లబూస్‌ఛేంజ్ లు 361 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే స్టీవ్ స్మిత్‌తో జతకట్టిన వార్నర్ డబుల్ సెంచరీని సాధించాడు. ఇక అప్పటినుంచి పాక్ బౌలర్లపై మ రింతగా విరుచు కుపడ్డాడు. ఎంతలా అంటే మరో 71 బంతు ల్లోనే 250 మార్కును చేరుకు న్నాడు. మరోవైపు అప్పటివరకు నిలకడగా ఆడిన స్మిత్ (36) షాహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లోనే రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మాథ్యూ వేడ్‌తో వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరే గాడు. కొద్ది సమయంలోనే బౌండరీ సాధించి కేవలం 389 బంతుల్లో మొదటి ట్రిపుల్ సెంచరీని సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన 7వ బ్యా ట్స్‌మన్‌గా సరికొత్త రికార్డును సృష్టించాడు. మరోవైపు మా థ్యూ వేడ్ కూడా బౌండరీలతో అలరించాడు. అప్పటికే స్కోరు 589 కావడంతో ఆస్ట్రేలియా తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ సమయానికి డేవిడ్ వార్నర్ (335, నాటౌట్), మాథ్యూ వేడ్ (38, నాటౌట్) గా ఉన్నారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన అఫ్రిది ఒక్కడికే మూడు వికెట్లు దక్కాయ.
1స్మిత్ రికార్డు..
ఈ మ్యాచ్‌లో 36 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 7వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా సరికొత్త ఘనత సాధించాడు. స్మిత్ ఈ ఫీట్‌ను కేవలం 126 ఇన్నింగ్స్ ల్లోనే పూర్తిచేసి, టీమిండియా మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూ ల్కర్, వీరేంద్ర సెవాగ్‌లను అధిగమించాడు. 7వేల పరుగుల మైలురాయని చేరుకునేందుకు సచిన్‌కు 136 ఇన్నింగ్స్‌లు పట్టగా, సెవాగ్‌కు 134 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయ.
పాక్ టపటపా..
అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయ 96 పరుగులు చేసింది. షాన్ మసూద్ (19), ఇమాముల్ హక్ (2), కెప్టెన్ అజార్ అలీ (9), అసద్ షాఫీఖ్ (9), ఇఫ్తికర్ అహ్మద్ (10) తక్కువ స్కోర్లకే అవుట్ కాగా, మహ్మద్ రిజ్వాన్ (0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో బాబర్ అజామ్ (43), యాసిర్ షా (4) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు పడగొట్టగా, పాట్ కమిన్స్, జోష్ హజెల్‌వుడ్ చెరో వికెట్ తీశారు.
వార్నర్ రికార్డులు..
ఆస్ట్రేలియా తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన 7వ బ్యాట్స్‌మన్‌గా వార్నర్ సరికొత్త ఘనత సాధించాడు.
డే, నైట్ టెస్టులో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు.
వేగవంతంగా ట్రిపుల్ సెంచరీ సాధించిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా వార్నర్ నిలిచాడు. భారత్‌కు చెందిన వీరేంద్ర సెవాగ్ 278 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా వార్నర్ నిలిచాడు.
స్కోర్ బోర్డు..
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (నాటౌట్) 335, జో బర్న్స్ (సీ) రిజ్వాన్ (బీ) షాహీన్ అఫ్రిది 4, మమూస్ లబూస్‌ఛేంజ్ (బీ) షాహీన్ అఫ్రిది 162, స్టీవ్ స్మిత్ (సీ) రిజ్వాన్ (బీ) షాహీన్ అఫ్రిది 36, మాథ్యూ వేడ్ (నాటౌట్) 38. ఎక్స్‌ట్రాలు: 14.
మొత్తం: 589 (127 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి)
వికెట్ల పతనం: 1-8, 2-369, 3-490
బౌలింగ్: మహ్మద్ అబ్బాస్ 29-6-100-0, షాహీన్ అఫ్రిది 30-5-88-3, మహ్మద్ ముస 20-1-114-0, యాసిర్ షా 32-1-197-0, ఇఫ్తికర్ అహ్మద్ 15-0-75-0, అజార్ అలీ 1-0-9-0.
పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్: షాన్ మసూద్ (సీ) పైన్ (బీ) హజెల్‌వుడ్ 19, ఇమాముల్ హక్ (సీ) వార్నర్ (బీ) స్టార్క్ 2, అజార్ అలీ (సీ) స్టీవ్ స్మిత్ (బీ) పాట్ కమిన్స్ 9, బాబ ర్ అజామ్ (బ్యాటింగ్) 43, అసద్ షఫీఖ్ (సీ) పైన్ (బీ) స్టార్క్ 9, ఇఫ్తికర్ అహ్మద్ (సీ) పైన్ (బీ) స్టార్క్ 10, మహ్మద్ రిజ్వాన్ (సీ) పైన్ (బీ) స్టార్క్ 0, యాసిర్ షా (బ్యాటింగ్) 4.
ఎక్స్‌ట్రాలు: 0, మొత్తం: 96 (35 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి)
వికెట్ల పతనం: 1-3, 2-38, 3-38, 4-69, 5-89, 6-89
బౌలింగ్: మిచెల్ స్టార్క్ 13-5-22-4, పాట్ కమిన్స్ 14-1-45-1, జోష్ హజెల్‌వుడ్ 8-2-29-1.
*చిత్రం... పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండవ, డే/నైట్ టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో 335 పరుగులు
చేసి నాటౌట్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు సహచరుల అభినందన