క్రీడాభూమి

నాలుగో స్థానానికి శ్రేయాస్ కరెక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: గత కొద్ది రోజులుగా భారత క్రికెట్ జట్టులో నాలుగో స్థానం ఎవరిదనే దానిపై సం దిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ నాలుగో స్థానానికి యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ అర్హుడని, అతడు అన్ని విధాలుగా ఆ స్థానానికి న్యాయం చే యగలడని పేర్కొన్నాడు. గత రెం డేళ్లుగా అయ్యర్ ఆట తీరులో మార్పు ను గమనించామన్నాడు. 2017లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ కు మొదటిసారిగా అయ్యర్‌కు చోటు కల్పించినట్లు ఎమ్మెస్కే గుర్తుచేశాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్ లోనూ రెండు అర్ధ సెంచరీలు సాధిం చి ఆకట్టుకున్నట్లు చెప్పాడు. దక్షిణా ఫ్రికాతో జరిగిన మూడు వనే్డల సిరిస్ తర్వాత అతడు కొద్దికాలం పాటు జట్టుకు దూరమయ్యాడు. ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. అయతే ఎమ్మెస్కే మాట్లాడుతూ ప్రస్తుత జట్టు లో నాణ్యమైన ఆటగాళ్లున్నారని, వచ్చి న అవకాశాన్ని యువ ఆటగాళ్లు కూడా అందిపుచ్చుకొని రాణిస్తున్నారని పే ర్కొన్నాడు. మరోవైపు భారత బౌలింగ్ విభాగం కూడా తాము అనుకున్నదాని కంటే చాలా పటిష్టంగా తయారైంద ని, బుమ్రాను అన్ని విధాలా రాటు దేలేలా తయారు చేశామని చెప్పుకొ చ్చాడు. ప్రస్తుతం భారత జట్టు ఆట తీరుపై సంతృప్తిని వ్యక్తం చేశాడు.
*చిత్రం... చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్