క్రీడాభూమి

కామ్‌వాల్‌కు 7 వికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 27: భారతరత్న అటల్ బిహారీ వాజపేయి స్టేడియంలో బుధవారం అఫ్గనిస్తాన్‌తో ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ బౌలర్ రఖీం కామ్‌వాల్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో ఏడు వికెట్లు సాధించాడు. దీంతో అఫ్గనిస్తాన్ 68.3 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ జావెద్ అహ్మదీ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, మిడిలార్డర్‌లో అఫ్సర్ జజాయి 32, టైలెండర్ అమీర్ అమ్జా 34 పరుగులు చేశారు. ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో అఫ్గనిస్తాన్ భారీ స్కోరు చేయలేకపోయింది. కామ్‌వాల్ 25.3 ఓవర్లు బౌల్ చేసి 75 పరుగులకు 7 వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ జాసన్ హోల్డర్ 22 పరుగులకు 2 వికెట్లు సాధించగా, జోమెల్ వారితాన్‌కు 1 వికెట్ లభించింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు నష్టపోయి 68 పరుగులు చేసింది. 11 పరుగులు చేసిన క్రెగ్ బ్రాత్‌వైట్‌ను అమీర్ హమ్జా ఎల్బీగా ఔట్ చేశాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన షాయ్ హోప్ 7 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఇసానుల్లా జనాత్ క్యాచ్ పట్టగా ఔట్ అయ్యాడు. ఆట ముగిసే సమయానికి జాన్ క్యాంబెల్ 30, క్షమర్ బ్రూక్స్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. అఫ్గనిస్తాన్ కంటే విండీస్ ఇంకా 119 పరుగుల వెనుకంజలో ఉండగా, చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.
*చిత్రం... తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో ఏడు వికెట్లు సాధించిన వెస్టిండీస్ బౌలర్ రఖీం కామ్‌వాల్‌కు సహచరుల అభినందన