క్రీడాభూమి

పంత్‌పై ఎవరి ఒత్తిడీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌పై ఎవరి ఒత్తిడి లేదని భారత సీనియర్ క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. ఇటీవల పంత్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడాన్ని ప్రస్తావిస్తూ నిజానికి పంత్ తనకు తానే ఒత్తిడిని పెంచుకుంటున్నాడని వ్యాఖ్యానించాడు. మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని సమర్థంగా భర్తీ చేయడం అంటే ఆషామాషీ కాదని, అందుకే పంత్ తనంత తానే ఒత్తిడి లోనవుతున్నాడని ఎమ్మెస్కే అభిప్రాయపడ్డాడు. వృద్ధిమాన్ సాహా మళ్లీ జట్టులోకి రావడంతో టెస్టు ఫార్మాట్‌లో దాదాపుగా తన స్థానాన్ని కోల్పోయిన పంత్ వనే్డ, టీ-20 ఫార్మాట్స్‌లో ఏవిధంగా రాణిస్తాడో ప్రశ్నార్థకంగా మారింది. వెస్టిండీస్‌తో జరిగే టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో ఆడే జట్టుకు ఎంపికైన పంత్ ఆ అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. కాగా, అటు బ్యాటింగ్‌లో, ఇటు కీపింగ్‌లో గొప్పగా రాణించలేపోయిన పంత్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని ఎమ్మెస్కే అభిప్రాయపడ్డాడు. అందుకనే విండీస్‌తో సిరీస్‌కు అతనిని ఎంపిక చేసినట్టు చెప్పాడు. పంత్‌ను విమర్శించడం మానేసి స్వేచ్ఛగా ఆడే అవకాశాన్ని కల్పించాలని భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెస్కే గుర్తు చేశాడు. అదేవిధంగా జాతీయ జట్టుకు నాయకత్వం వహిస్తున్నపుడు ఎవరైనా ఒత్తిడికి లోనవుతారని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా చెప్పాడని ఎమ్మెస్కే అన్నాడు. వారు ఆశించిన విధంగానే పంత్‌ను స్వేచ్ఛగా విడిచిపెడితే, అతను మళ్లీ ఫామ్‌లోకి వస్తాడన్న నమ్మకం తనకు ఉందని అన్నాడు. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా రిషబ్ పంత్ శక్తిసామర్థ్యాలపై అపారమైన నమ్మకం ఉందని అన్నాడు. ధోనీ స్థాయి వ్యక్తి స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమైన విషయమని, అందుకే పంత్ ఒత్తిడి లోనవుతున్నాడని అభిప్రాయపడ్డాడు. ఒకసారి ఫామ్‌లోకి వెళ్తే అతను తిరిగి వెనక్కి చూసుకునే పరిస్థితి ఉండదని ఎమ్మెస్కే వ్యాఖ్యానించాడు.