క్రీడాభూమి

బంగ్లా చిత్తుచిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 24: భారత్‌తో జరిగిన రెండవ, చివరి టెస్టులో బంగ్లాదేశ్ చిత్తుచిత్తుగా ఓడింది. తొలిసారి డే/నైట్ టెస్టులో బంగ్లాను ఢీకొన్న టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. కాగా, ఈ టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగియడం విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ఆధిపత్యానికి అద్దం పడుతుంది. మ్యాచ్ మూడో రోజు, ఆదివారం 6 వికెట్లకు 152 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన బంగ్లాదేశ్ 41.1 ఓవర్లలో 195 పరుగులకు ఆలౌటైంది. ఇబాదత్ హొస్సేన్ పరుగుల ఖాతాను తెరవకుండానే ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. క్రీజ్‌లో నిలిచేందుకు చివరి వరకూ పోరాడిన ముష్ఫికర్ రహీం 96 బంతుల్లో, 13 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లోనే రవీంద్ర జడేజాకు చిక్కాడు. అల్ అమీన్ హొస్సేన్ 20 బంతుల్లో 21 పరుగులు సాధించి, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అప్పటికి అబూ జయేద్ రెండు పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. అంతకు ముందు, రెండో రోజు ఆటలో, మహమ్మదుల్లా (39) రిటైర్డ్ హర్ట్ అయిన విషయం తెలిసిందే. 14.1 ఓవర్లు బౌల్ చేసిన ఉమేష్ యాదవ్ 53 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టగా, ఇశాంత్ శర్మ 56 పరుగులిచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించి, రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్న ఇశాంత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా అతనే కైవసం అందుకున్నాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 30.3 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్ కేవలం 106 పరుగులకే ఆలౌట్‌కాగా, అందుకు సమాధానంగా టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 89.4 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. 241 పరుగులు వెనుకంజలో నిలిచిన బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్‌లో కొద్దిపాటి ప్రతిఘటనను చూపినప్పటికీ ఫలితం లేకపోయింది. గులాబీ బంతి ఏ దిశగా దూసుకొస్తుందో అర్థం చేసుకోలేక ఆ జట్టు మ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా ఇన్నింగ్స్ పరాజయం తప్పలేదు.
స్కోరుబోర్డు
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 30.3 ఓవర్లలో 106 ఆలౌట్ (షాద్మ న్ ఇస్లాం 29, లిటన్ దాస్ 24, నరుూమ్ హసన్ 19, ఇశాంత్ శర్మ 5/22, ఉమేష్ యాదవ్ 3/29, మహమ్మద్ షమీ 2/36).
భారత్ తొలి ఇన్నింగ్స్: 89.4 ఓవర్లలో 9 వికెట్లకు 347 డిక్లేర్డ్ (విరాట్ కోహ్లీ 136, చటేశ్వర్ పుజారా 55, అజింక్య రహానే 51, అల్ అమీర్ హొస్సేన్ 3/85, ఇబాదత్ హొస్సేన్ 3/91, అబూ జయేద్ 2/77).
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 6 వికెట్లకు 152): షాద్మన్ ఇస్లాం ఎల్‌బీ ఇశాంత్ శర్మ 0, ఇమ్రుల్ కయాస్ సీ విరాట్ కోహ్లీ బీ ఇశాంత్ శర్మ 5, మోమునుల్ హక్ సీ వృద్ధిమాన్ సాహా బీ ఇశాంత్ శర్మ 0, మహమ్మద్ మిథన్ సీ మహమ్మద్ షమీ బీ ఉమేష్ యాదవ్ 6, ముష్ఫికర్ రహీం సీ రవీంద్ర జడేజా బీ ఉమేష్ యాదవ్ 74, మహమ్మదుల్లా రిటైర్డ్ ఔట్ 39, మెహదీ హసన్ సీ విరాట్ కోహ్లీ బీ ఇశాంత్ శర్మ 15, తైజుల్ ఇస్లాం సీ అజింక్య రహానే బీ ఉమేష్ యాదవ్ 11, ఇబాదత్ హొస్సేన్ సీ విరాట్ కోహ్లీ బీ ఉమేష్ యాదవ్ 0, అల్ అమీన్ హొస్సేన్ సీ సాహా బీ ఉమేష్ యాదవ్ 21, అబూ జయేద్ 2 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 22, మొత్తం (41.1 ఓవర్లలో ఆలౌట్) 195.
వికెట్ల పతనం: 1-0, 2-2, 3-9, 4-13, 5-133, 6-152, 7-152, 8-184, 9-195.
బౌలింగ్: ఇశాంత్ శర్మ 13-2-56-4, ఉమేష్ యాదవ్ 14.1-1-53-5, మహమ్మద్ షమీ 8-0-42-0, రవిచంద్రన్ అశ్విన్ 5-0-19-0, రవీంద్ర జడేజా 1-0-8-0.