క్రీడాభూమి

భారత్‌కు తిరుగులేని విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 24: ఈ టెస్టులో భారత పేసర్లు ఇశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ కలిసి మొత్తం 19 వికెట్లు సాధించారు. 2018లో ట్రెంట్‌బ్రిడ్జిలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారత పేసర్లు 19 వికెట్లు పడగొట్టారు. కాగా, అత్యధికంగా 20 వికెట్లు కైవసం చేసుకున్న మ్యాచ్ 2018లో జొహానె్నస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగింది. ఆ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి జస్‌ప్రీత్ బుమ్రా 7, మహమ్మద్ షమీ 6, భువనేశ్వర్ కుమార్ 4, ఇశాంత్ శర్మ 3 చొప్పున వికెట్లు తీశారు. ఇలావుంటే, స్వదేశంలో జరిగిన టెస్టులో భారత పేసర్లు ఎక్కువ వికెట్లు కూల్చడం మాత్రం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు 2018లో శ్రీలంకపై కోల్‌కతాలోనే జరిగిన టెస్టులో పేసర్లు 17 వికెట్లు కూల్చారు.
*చిత్రం... బంగ్లాదేశ్‌పై భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించిన పేసర్లు ఇశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్