క్రీడాభూమి

ఇదే తొలిసారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 24: వరుసగా నాలుగు టెస్టులను ఇన్నింగ్స్ తేడాతో కైవసం చేసుకున్న మొదటి జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పుణే టెస్టును ఇన్నింగ్స్ 137 పరుగులు, రాంచీలో జరిగిన రెండో టెస్టును ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో గెల్చుకుంది. తాజా సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను ఇండోర్‌లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 130 పరుగులు, ఆదివారం కోల్‌కతాలో ముగిసిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 46 పరుగుల ఆధిక్యంతో విజయాలను నమోదు చేసి, అరుదైన చరిత్రను సృష్టించింది.
* ఇద్దరు భారత ఫాస్ట్ బౌలర్లు ఒకే టెస్టులో ఎనిమిది లేదా అంతకు మించి వికెట్లు పడగొట్టడం ఇదే మొదటిసారి. ఈ ఘనతను సాధించిన ఇశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ సరికొత్త చరిత్రను సృష్టించారు. కాగా, ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే ఫీట్‌ను గతంలో 2010-11 యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్లు ర్యాన్ హారిస్, మిచెల్ జాన్సన్ సాధించారు.
* కెప్టెన్‌గా అత్యధిక టెస్టు విజయాలను సాధించిన కెప్టెన్ల జాబితాలో విరాట్ కోహ్లీకి ఐదో స్థానం దక్కింది. అతనికి కెప్టెన్‌గా ఇది 33వ విజయం. గ్రేమ్ స్మిత్ 53 విజయాలతో అగ్రస్థానాన్ని ఆక్రమిస్తే, రికీ పాంటింగ్ 48, స్టీవ్ వా 41, క్లెయివ్ లాయిడ్ 36 చొప్పున విజయాలను నమోదు చేశారు. అలాన్ బార్డర్ 32 విజయాలతో కోహ్లీ తర్వాత, ఆరో స్థానంలో ఉన్నాడు.
* స్పిన్నర్లు ఒక్క వికెట్ కూడా తీయకుండా భారత జట్టు స్వదేశంలో గెలిచిన తొలి టెస్టు మ్యాచ్ ఇదే. మొత్తం మీద రెండోది. ఈ మ్యాచ్‌లో ఇశాంత్ శర్మ తొమ్మిది, ఉమేష్ యాదవ్ ఎనిమిది, మహమ్మద్ షమీ రెండు చొప్పున వికెట్లు తీశారు. స్పిన్నర్లుకేవలం ఏడు ఓవర్లు మాత్రమే బౌల్ చేయడం గమనార్హం.
* టీమిండియా వరుసగా ఏడు టెస్టుల్లో విజయాలను నమోదు చేయడం ఇదే మొదటిసారి. 2013లో ఆస్ట్రేలియాపై నాలుగు, వెస్టిండీస్‌పై రెండు చొప్పున వరుసగా ఆరు టెస్టులను భారత్ గెల్చుకుంది. తాజా విజయపరంపర వెస్టిండీస్ టూర్‌తో మొదలైంది. ఈ ఏడు మ్యాచ్‌లను భారత జట్టు ఇన్నింగ్స్ తేడా లేదా కనీసం 200 పరుగుల తేడాతో గెల్చుకున్నవే కావడం విశేషం.
* ఈ ఏడాది భారత పేసర్లు అసాధారణ రీతిలో రాణిస్తున్నారు. ఇశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ ఇప్పటి వరకూ తలా ఇరవైకిపైగా టెస్టు వికెట్లు సాధించడం విశేషం. 1978లో ఇంగ్లాండ్ పేసర్లు ఇయాన్ బోథమ్, క్రిస్ ఓల్డ్, బాబ్ విల్స్ ఈ ఫీట్‌ను ప్రదర్శించారు. చాలా అరుదైన ఘనతను భారత ఫాస్ట్ బౌలర్లు సాధించడం సరికొత్త అధ్యాయానికి శ్రీకారంగా చెప్పుకోచ్చు. ఇంతకాలం స్పిన్‌పైనే ఆధారపడిన భారత్ ఇటీవల కాలంలో ఫాస్ట్ బౌలింగ్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్నది.

*చిత్రం... విక్టరీ ల్యాప్‌లో ట్రోఫీని రిజర్వ్‌డ్ వికెట్‌కీపర్ శిఖర్ భరత్‌కు అప్పగించి, కొత్త సంప్రదాయానికి తెరతీసిన
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ