క్రీడాభూమి

టెస్టు క్రికెట్‌కు విస్తృత ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 24: వనే్డ, టీ-20 ఇంటర్నేషనల్స్ మాదిరిగానే టెస్టు క్రికెట్‌కు కూడా విస్తృత ప్రచారం అవసరమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. బంగ్లాదేశ్‌తో ఆదివారం ముగిసిన రెండవ, చివరి టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ ఈ ఫార్మాట్ పట్ల ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని తొలగించాల్సిన అవసరం ఉందన్నాడు. మొట్టమొదటిసారి డే/నైట్ టెస్టును, గులాబీ బంతులతో ఆడడం కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పాడు. సుమారు 50 వేల మంది సమక్షంలో జరిగిన ఈ మ్యాచ్ అభిమానులను ఆకట్టుకుంది. అయితే, టెస్టు ఫార్మాట్‌కు మరింతగా ప్రచారం అవసరమని, అప్పుడే మిగతా ఫార్మాట్ల మాదిరిగానే దీనికీ ఆదరణ పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్‌ను ప్రమోట్ చేయడం కేవలం ఆటగాళ్ల బాధ్యత మాత్రమే కాదని, క్రికెట్ బోర్డు కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అన్నాడు. టీ-20 ఫార్మాట్‌కే అత్యధిక ప్రాధాన్యతనిస్తే, ప్రేక్షకులు, అభిమానులు కూడా దానికే అలవాటు పడతారని కోహ్లీ వ్యాఖ్యానించాడు. వారు టెస్టు క్రికెట్‌ను కూడా సమానంగా ఆదరించాలంటే, అందుకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించాలని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు అభిమానులతో, ప్రత్యేకించి విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని సూచించాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియం మొత్తం ప్రేక్షకుల కేరింతలతో హోరెత్తిందని, టెస్టు క్రికెట్‌కు కూడా ఆదరణ ఉందని దీనిని బట్టి అర్థమవుతుందని అన్నాడు. అయితే, దీనిని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని హితవు పలికాడు. నిజమైన క్రికెట్‌ను చూసే అవకాశాన్ని అభిమానులకు కల్పించగలిగాలని అన్నాడు. ఈ ఫార్మాట్‌లో మ్యాచ్‌ల నిర్వహణ కూడా సక్రమంగా ఉండాలని అన్నాడు. గులాబీ బంతితో ఆడడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, క్రీజ్‌లో ఉన్నంత సేపూ తాను ఎంతో ఆనందంగా గడిపానని, ఈ బంతితో మ్యాచ్ ఆడడం కొత్త అనుభూతిని కలిగించిందని కోహ్లీ చెప్పాడు. ఆట జరుగుతున్నప్పుడు బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ ఇచ్చిన సూచన ఎంతో బాగుందని అన్నాడు. లంచ్ నుంచి టీ టైమ్ వరకూ ఏ విధంగా ఆడతామో, డే/నైట్ మ్యాచ్ ఆరంభంలో అదే రీతిలో ఆడాల్సిందిగా సచిన్ సూచించాడని, అతను చెప్పిన సలహా తమకు ఉపయోగపడిందని చెప్పాడు. చీకటి పడుతున్న కొద్దీ గులాబీ బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుందని అన్నాడు. ఆ సమయంలో జాగ్రత్తగా ఆచితూచి ఆడాల్సి ఉంటుందన్నాడు. మ్యాచ్ ఎప్పుడు ప్రారంభించాలి? ఏ సమయంలో డిక్లేర్ చేయాలి? వంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతుక్కోని, మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. మొత్తం మీద డే/నైట్ టెస్టు కొత్తగా ఉందన్నాడు. ఫ్లడ్‌లైట్లు వెలిగినప్పుడే తాను మైదానంలోకి వెళ్లానని, కాబట్టి, పూర్తిగా లైట్లకు అలవాటు పడేవరకూ క్రీజ్‌లో నిలదొక్కుకోవాల్సిన బాధ్యత తనపై పడిందని కోహ్లీ అన్నాడు. ఒక రకంగా తనకు ఐపీఎల్ మ్యాచ్ వాతావరణమే కనిపించిందని వ్యాఖ్యానించాడు. ఇలాంటి మ్యాచ్‌లు ఉండేనే ఆట ఉత్సాహభరితంగా కొనసాగుతుందని చెప్పాడు. టెస్టు ఫార్మాట్‌ను విస్తృత ప్రచారం చేస్తే, అసలుసిసలైన క్రికెట్ ప్రజల్లోకి వెళుతుందని తెలిపాడు. మళ్లీ టెస్టులకు ఆదరణ పెరుగుతుందన్నాడు.
*చిత్రం... భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ