క్రీడాభూమి

ఇది ప్రారంభం మాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 24: డే/నైట్ టెస్టు మ్యాచ్‌లకు ఇది ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని ఉంటాయని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఈ ఫార్మాట్‌లో ఇలాంటి మ్యాచ్‌లు కేవలం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానానికే పరిమితం కాకూడదని వ్యాఖ్యానించాడు. దేశ వ్యాప్తంగా ఇలాంటి మ్యాచ్‌లు జరగాలన్నదే తన కోరికని అన్నాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రేక్షకుల ప్రతిస్పందన చూసి తాను ఎంతో సంతోషించానని చెప్పాడు. ఒకప్పుడు టెస్టు క్రికెట్‌కు ఎంతో ఆదరణ ఉండేదని, అలాంటి రోజులే మళ్లీ వస్తాయన్న నమ్మకం తనకు ఉందని అన్నాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే ఎంతో ప్రచారం చేశామని, అది సత్ఫలితాన్నిచ్చిందని గంగూలీ చెప్పాడు. మ్యాచ్ విజయవంతం కావడంతో ఊపిరి పీల్చుకున్నామని తెలిపాడు.

*చిత్రం... బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ గంగూలీ