క్రీడాభూమి

పాక్‌కు ఇన్నింగ్స్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, నవంబర్ 24: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌పై ఆసీస్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 86.2 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్‌కాగా, అందుకు సమాధానంగా ఆస్ట్రేలియా 157.4 ఓవర్లలో 580 పరుగుల భారీ స్కోరు సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 340 పరుగులు వెనుకబడిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించి, మ్యాచ్ మూడో రోజు, శనివారం ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లకు 64 పరుగులు చేసింది. ఆదివారం ఉదయం ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించి, 84.2 ఓవర్లలో 335 పరులకు ఆలౌటైంది. బాబర్ ఆజం 104 పరుగులతో రాణించగా, మహమ్మద్ రిజ్వాన్ 95 పరుగులు చేశాడు. చివరిలో యాసిర్ షా కూడా పోరాటాన్ని కొనసాగించి, 42 పరుగులు సాధించాడు. అయితే, వీరి ప్రతిభ పాక్‌ను ఇన్నింగ్స్ ఓటమి నుంచి కాపాడలేకపోయింది.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్: 86.2 ఓవర్లలో 240 ఆలౌట్ (అజర్ అలీ 39, అసద్ షఫీక్ 76, మహమ్మద్ రిజ్వాన్ 27, మిచెల్ స్టార్క్ 4/52, జొస్ హాజెల్‌వుడ్ 2/46, పాట్ కమిన్స్ 3/60).
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 157.4 ఓవర్లలో 580 ఆలౌట్ (డేవిడ్ వార్నర్ 154, జో బర్న్స్ 97, మార్నస్ లబుషేన్ 185, మాథ్యూ వేడ్ 60, యాసిర్ షా 4/205, షహీన్ అఫ్రిదీ 2/96, హరీస్ సొహేల్ 2/75, ఇమ్రాన్ ఖాన్ 1/73).
పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్: 84.2 ఓవర్లలో 335 ఆలౌట్ (షాన్ మసూద్ 42, బాబర్ ఆజం 104, మహమ్మద్ రిజ్వాన్ 95, యాసిర్ షా 42, మిచెల్ స్టార్క్ 3/73, పాట్ కమిన్స్ 2/69, జొస్ హాజెల్‌వుడ్ 4/63, నాథన్ లియాన్ 1/74).
*చిత్రం... పాకిస్తాన్ సెంచరీ వీరుడు బాబర్ ఆజం