క్రీడాభూమి

తిరుగులేని టీమిండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 24: ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా తన నెంబర్ వన్ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ కోసం వివిధ జట్ల మధ్య సిరీస్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భారత్ గొప్పగా రాణిస్తున్నది. వెస్టిండీస్‌ను, ఆతర్వాత దక్షిణాఫ్రికాను ఓడించి, సిరీస్‌లను కైవసం చేసుకొని, తాజాగా బంగ్లాదేశ్‌పైన కూడా గెలిచింది. ఒక్కో సిరీస్ విజయానికి 120 పాయింట్లు జమ అవుతాయి.