క్రీడాభూమి

ఇంగ్లాండ్ ఎదురీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్ మొన్గానుయ్, నవంబర్ 24: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో ఇంగ్లాండ్ ఎదురీదుతున్నది. మొదటి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి కంటే 353 పరుగులు వెనుకబడిన ఈ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించి, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 55 పరుగులు చేసింది. ఇంకా 207 పరుగుల వెనుకంజలో నిలిచిన ఇంగ్లాండ్ చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. మ్యాచ్ చివరి రోజైన సోమవారం ఈ జట్టు ఎంత వరకూ కివీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటుందనేది అనుమానమే. మ్యాచ్‌ని గెల్చుకునే అవకాశాలు ఇంగ్లాండ్‌కు లేవనేది స్పష్టం. కాబట్టి డ్రా చేసుకోవడానికే ప్రయత్నించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 123 ఓవర్లలో 353 పరుగులకు కట్టడి చేసిన న్యూజిలాండ్ అనంతరం తన మొదటి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 615 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో 262 పరుగులు వెనుకబడిన బడిన ఇంగ్లాండ్ నాలుగో రోజున మూడు కీలక వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేయగలిగింది. పిచ్ తీరు, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే, న్యూజిలాండ్ బౌలర్లదే పైచేయి అవుతుందనే వాదన వినిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌కు మ్యాచ్‌ని డ్రా చేసుకోవడం తప్ప మరో మార్గం లేదన్నది విశే్లషకుల అభిప్రాయం.