క్రీడాభూమి

గెలుపు నేటికి వాయిదా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగు తున్న మొదటి డే నైట్ టెస్టులో భారత్ అన్ని విభాగాల్లో ఆధిప త్యం చెలాయిస్తోంది. రెండో రోజే గెలుపు ఖాయం అనుకు న్నా, నాలుగు వికెట్ల దూరంలో ఆగింది.
కోహ్లీ సెంచరీ..
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 173/3తో రెండో రోజు శనివారం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా అదరగొట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజింక్యా రహానెతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 27, ఓవరాల్ గా 70వ సెంచరీని నమోదు చేశాడు. కోహ్లీకి తోడు రహానే (51) కూడా వేగంగా అర్ధ సెంచరీని సాధించి, ఆ తర్వాత కొద్దిసేపటి కే తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం క్రీజు లోకి వచ్చిన రవీంద్ర జడేజా (12) తొందరగానే పెవిలియన్‌కు చేరగా, అప్పటివరకు నిలకడగా ఆడిన కోహ్లీ (136) భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద తైజుల్ ఇస్లాం పట్టిన అద్భుత క్యాచ్‌తో భారంగా పెవిలియన్‌కు చేరాడు. మరోవైపు లోకల్ బాయ్ వృద్ధిమాన్ సాహా నిలకడగా ఆడినా రవిచంద్రన్ అశ్విన్ (9), ఉమేశ్ యాదవ్ (0), ఇషాంత్ శర్మ (0) పరుగు లేమీ చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగారు. మహ్మద్ షమీ (10, నాటౌట్), సాహా (17, నాటౌట్) కొద్దిసేపు బంగ్లా బౌలర్లకు పరీక్షగా నిలిచారు. అయితే కెప్టెన్ కోహ్లీ 347 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు. బంగ్లా బౌలర్లలో ఆల్ అమీన్, ఎబాదత్ హుస్సేన్ లు మూడేసి వికెట్లు పడగొట్టగా, అబూ జాయేద్ 2, తైజుల్ ఇస్లాం 1 వికెట్ తీశారు.
ఈసారీ ఇషాంతే..
అప్పటికే 241 పరుగులు ఆధిక్యం సాధించిన భారత్ డిక్లేర్ చేసిన అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన బంగ్లాదేశ్ మళ్లీ తడ‘బ్యాటు’కు గురైంది. ఇషాంత్ శర్మ వేసిన మొదటి ఓవర్ చివరి బంతికి ఓపెనర్ షాద్మాన్ ఇస్లాం (0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరగా, కెప్టెన్ మామినూల్ హాక్ (0) కూడా ఇషాంత్ బౌలింగ్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో జట్టు స్కోరు 2 పరుగులకు 2 వికెట్లు కోల్పోయంది. ఆ తర్వాత కొద్దిసేపటికే వికెట్ కీపర్ మహ్మద్ మిథున్ (6), ఇమ్రూల్ కైస్ (5) కూడా వెంటవెంటనే అవుటయ్యారు. దీంతో క్రీజులోకి వచ్చిన ముష్ఫీకర్ రహీం, మహ్మదుల్లా జట్టు బాధ్య తను భుజాన వేసుకున్నారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పెంచే ందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మహ్మదుల్లా (39) పరుగుల వద్ద రిటైర్ డ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మెహిడి హసన్‌తో కలిసి ముష్ఫీకర్ రహీం (59, నాటౌట్) అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో మెహిడి హసన్ (15), తైజుల్ ఇస్లాం (11) పెవిలియన్ చేరారు. అప్పటికే రెండో రోజు ఆట ముగియడంతో బంగ్లా 6 వికెట్లు కోల్పో 152 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మకు 4 వికెట్లు దక్కగా, ఉమేశ్ యాదవ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు.
స్కోర్ బోర్డు:
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్: 106 ఆలౌట్
భారత్ మొదటి ఇన్నింగ్స్: మయాంక్ అగర్వాల్ (సీ) మెహిడి హసన్ (బీ) ఆల్ అమీన్ 14, రోహిత్ శర్మ (ఎల్బీ) (బీ) ఎబాదత్ హుస్సేన్ 21, చటేశ్వర్ పుజారా (సీ) షాద్మా న్ ఇస్లాం (బీ) ఎబాదత్ హుస్సేన్ 55, విరాట్ కోహ్లీ (సీ) తైజుల్ ఇస్లాం (బీ) ఎబాదత్ హుస్సేన్ 136, అజింక్యా రహా నే (సీ) ఎబాదత్ హుస్సేన్ (బీ) తైజుల్ ఇస్లాం 51, రవీంద్ర జడేజా (బీ) అబూ జాయేద్ 12, వృద్ధిమాన్ సాహా (నాటౌ ట్) 17, రవిచంద్రన్ అశ్విన్ (ఎల్బీ) (బీ) ఆల్ అమీన్ 9, ఉమేశ్ యాదవ్ (సీ) షాద్మాన్ ఇస్లాం (బీ) అబూ జాయేద్ 0, ఇషాంత్ శర్మ (ఎల్బీ) (బీ) ఆల్ అమీన్ 0, మహ్మద్ షమీ (నాటౌట్) 10. ఎక్స్‌ట్రాలు: 22.
మొత్తం: 347 (89.4 ఓవర్లలో 9 వికెట్లకు..)
వికెట్ల పతనం: 1-26, 2-43, 3-137, 4-236, 5-289, 6-308, 7-329, 8-330, 9-331.
బౌలింగ్: ఆల్ అమీన్ హుస్సేన్ 22.4-3-85-3, అబూ జాయేద్ 21-6-77-2, ఎబాదత్ హుస్సేన్ 21-3-91-3, తైజుల్ ఇస్లాం 25-2-80-1.
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: షాద్మాన్ ఇస్లాం (ఎల్బీ) (బీ) ఇషాంత్ 0, ఇమ్రూల్ కైస్ (సీ) కోహ్లీ (బీ) ఇషాంత్ 5, మామినుల్ హాక్ (సీ) సాహా (బీ) ఇషాంత్ 0, మహ్మద్ మిథున్ (సీ) షమీ (బీ) ఉమేశ్ 6, ముష్ఫీకర్ రహీం (బ్యా టింగ్) 59, మహ్మదుల్లా (రిటైర్డ్‌హార్ట్) 39, మెహిడి హసన్ (సీ) కోహ్లీ (బీ) ఇషాంత్ 15, తైజుల్ ఇస్లాం (సీ) ర హానే (బీ) ఉమేశ్ 11.
ఎక్స్‌ట్రాలు: 17, మొత్తం: 152 (32.3 ఓవర్లలో 6 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-0, 2-2, 3-9, 4-13, 5-133, 6-152
బౌలింగ్: ఇషాంత్ శర్మ 9-1-39-4, ఉమేశ్ యాదవ్ 10.3-0-40-2, మహ్మద్ షమీ 8-0-42-0, రవిచంద్రన్ అశ్విన్ 5-0-19-0.

*చిత్రాలు.. ఇషాంత్ శర్మ 9-1-39-4
*విరాట్ కోహ్లీ (136)