క్రీడాభూమి

ఆసిస్‌కు భారీ ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బెన్స్, నవంబర్ 23: పాకిస్తాన్ తో జరుగుతున్న మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించి, ఆధిక్యంలో నిలిచింది. అంతకుముం దు 312 పరుగులతో మూడో రోజు శనివారం బ్యాటింగ్‌కు దిగిన ఆసిస్ మూడో రోజు ఆటలో 580 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (154), మార్నస్ లబుస్‌ఛేంజ్ (185), మాథ్యూ వేడ్ (60) పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో యాసిర్ షాకు 4 వికెట్లు పడగా, షాహీన్ అఫ్రిది, హారిస్ సోహైల్‌కు రెండేసి వికెట్లు తీయగా, ఇమ్రాన్ ఖాన్, నసీమ్ షాకు ఒక్కో వికెట్ దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయ 64 పరుగులు చేసింది. కెప్టెన్ అజార్ అలీ (5), హారిస్ సోహైల్ (8), అసద్ షఫీఖ్ (0) పెవిలియన్‌కు చేరగా, ఓపెనర్ షాన్ మసూద్ (27), బాబర్ అజాం (20) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్ల లో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీయగా, పాట్ కమిన్స్ 1 వికెట్ పడగొట్టాడు. ఆట ముగిసేందుకు మరో రెండు రోజులు సమయంలో ఉండడంతో ఫలితం తేలే అవకాశముంది.

*చిత్రం... మార్నస్ లబుస్‌ఛేంజ్ (185)