క్రీడాభూమి

బీజే వాట్లింగ్ సూపర్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్ వౌన్గనుయ్, నవంబర్ 24: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. ఓవర్ నైట్ స్కోరు 144/4తో మూడో రోజు శనివారం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. అయతే హెన్రీ నికోల్స్ (41) రూట్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో క్రీజులోకి వచ్చిన డీగ్రాండ్ హోమ్‌తో కలిసి వికెట్ కీపర్ బీజే వాట్లింగ్ జట్టును ముందుండి నడిపించాడు. వీరిద్దరూ కలిసి ఇంగ్లీష్ బౌలర్లపై రెచ్చిపోయారు. అందివచ్చిన బంతులను బౌండరీలకు పంపుతూ స్కోరు బోర్డును పెంచారు. ఈ క్రమంలోనే వాటి లంగ్ (119, నాటౌట్) సెంచరీ సాధించగా, డీగ్రాండ్ హోమ్ (65) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయతే స్టోక్స్ వేసిన అద్భుత బంతికి సిబ్లేకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. వీరిద్దరూకలిసి ఆరో వికెట్‌కు 119 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మిచెల్ శాంత్నర్ (31, నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 6 వికెట్లు కోల్పోయ 394 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కుర్రాన్, బెన్ స్టోక్స్ రెండేసి వికెట్లు పడగొట్టగా, జాక్ లియాచ్, జో రూట్‌కు ఒక్కో వికెట్ దక్కింది.
*చిత్రం... డీగ్రాండ్ హోమ్, వాటి లంగ్