క్రీడాభూమి

హైదరాబాద్‌కు ఆడను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించి, స్వల్ప వ్యవధిలోనే యూటర్న్ తీసుకున్న హైదరాబాద్ క్రికెటర్ అంబటి రాయుడు వచ్చే రంజీ సీజన్‌లో హైదరాబాద్‌కు ఆడబోనని తేల్చి చెప్పాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అవినీతి పెరిగిందంటూ, దీనిని అరికట్టాలంటూ రాష్ట్ర ఐటీ, పారిశ్రామిక, పట్టాణాభివృద్ధి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి అవినీతే కారణమని, హెచ్‌సీఏలో డబ్బుతో ప్రభావితం చేసేవారి సంఖ్య పెరిగిపోయిందని, హెచ్‌సీఏ సభ్యుల్లో చాలామందిపై అవినీతి కేసులున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. గతంలో హెచ్‌సీఏలో రూ.100 కోట్ల అవినీతి జరిగినట్లు కూడా ఆరోపణలు చేశాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లో భాగంగా హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అంబటి రాయుడు జట్టులో రాజకీయాలు పెరిగిపోయాయని, ప్రస్తుత పరిణామాలతో జట్టులో మంచి వాతావరణం లేదని, దాంతోనే తాను హైదరాబాద్ జట్టుకు దూరంగా ఉండాదలుచుకున్నానని పేర్కొన్నాడు. కాగా, ఇటీవల జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ప్యానెల్ ఘనవిజయం సాధించిన విషయం విదితమే.

*చిత్రం... హైదరాబాద్ క్రికెటర్ అంబటి రాయుడు