క్రీడాభూమి

ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ విజేత పాకిస్తాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, నవంబర్ 23: ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2019 విజేతగా పాకిస్తాన్ అండర్-23 జట్టు నిలిచింది. శనివారం బంగ్లాదేశ్‌తో ఢాకా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాక్ 77 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ 301 పరుగులు చేసింది. వికెట్ కీపర్ రోహైల్ నజీర్ (113) సెంచరీకి తోడు ఇమ్రాన్ రఫీక్ (62), కెప్టెన్ సాద్ షకీల్ (42) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సుమాన్ ఖాన్‌కు 3 వికెట్లు దక్కగా, హసన్ మహమూద్ 2, మెహిడి హసన్‌కు ఒక వికెట్ లభించింది. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లా జట్టు 224 పరుగులకే కుప్పకూలింది. అఫీఫ్ హుస్సేన్ (49), కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో (46), మెహిడి హసన్ (42) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ హస్నైన్ 3 వికెట్లు తీయగా, కుష్దిల్ షా, సైఫ్ బదార్ రెండేసి వికెట్లు, అమద్ భట్, ఉమర్ ఖాన్ ఒక్కో వికెట్ తీసి విజయంలో తమవంతు పాత్ర పోషించారు.