క్రీడాభూమి
మను భాకర్‌కు స్వర్ణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 November 2019
పుతియాన్ (చైనా), నవంబర్ 21: భారత యువ షూటర్ మను భాకర్ ప్రపంచకప్ ఫైనల్స్ జూనియర్ విభాగంలో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. చైనాలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ టోర్నమెంట్లో గురువారం మహిళల విభాగంలో జరిగిన 10 మీటర్ల కేటగిరీ ఎయిర్ పిస్టల్ పోటీలో మను 244.7 పాయింట్లు సాధించి పతకాన్ని చేజిక్కించుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అభిషేక్ వర్మ, సౌరభ్ చౌదరి ఫైనల్లో ఆడడానికి అర్హత సాధించారు. ఈ క్వాలిఫయింగ్ పోటీలో 588 పాయింట్లతో వర్మ తొలి స్థానంలో నిలవగా, 581 పాయింట్లతో సౌరభ్ 7వ స్థానంలో కొనసాగుతున్నాడు.