క్రీడాభూమి

పాకిస్తాన్ 240 ఆలౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్స్, నవంబర్ 21: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులు చేసి ఆలౌటైంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టుకు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. షాన్ మసూద్, కెప్టెన్ అజార్ అలీ పరుగులు మొదటి వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. నిలకడగా ఆడుతున్న ఈ జంటను పాట్ కమిన్స్ విడదీశాడు. షాన్ మసూద్ (27) స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే అజార్ అలీ (39) హజెల్‌వుడ్ బౌలింగ్‌లో బర్న్స్‌కి క్యాచ్ ఇచ్చి వెను దిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హారిస్ సోహైల్ (1), బాబ ర్ ఆజామ్ (1), ఇఫ్తికర్ అహ్మద్ (7) విఫలమవడంతో పాకిస్తాన్ 94 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయ కష్టాల్లో పడింది. మరోవైపు వికెట్లు పడుతున్నా అసద్ షఫీఖ్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి ఆసిస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నా డు. అయతే ఈ జంట నిలదొ క్కుకునే క్రమంలో రిజ్వాన్ (37) ను పాట్ కమిన్స్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత యాసిర్ షాతో కలిసి షఫీఖ్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇదిలాఉంటే యాసిర్ షా (26)ను స్టార్క్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బంతికే షాహీన్ అఫ్రిదీ (0) అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్ల్రో అసద్ షఫీఖ్ (76)ను కమిన్స్ పెవిలియన్‌కు పంపగా, నసీమ్ షా (7)ను స్టార్క్ అవుట్ చేయడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు పడగొట్టగా, పాట్ కమిన్స్ 3, జోష్ హజెల్‌వుడ్ 2, నాథన్ లియాన్ 1 వికెట్ తీశారు.
*చిత్రం... వికెట్ తీసిన ఆనందంలో ఆస్ట్రేలియా టెస్టు