క్రీడాభూమి

పాటిన్సన్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, నవంబర్ 17: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేమ్స్ పాటిన్సన్‌పై వేటు పడింది. ఒక ఆటగాడిని వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ దూషించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. ఇటీవల జరిగిన షీఫీల్డ్ షీల్డ్ టోర్నీలో విక్టోరియా తరఫున ఆడిన పాటిన్సన్ క్వీన్స్‌లాండ్‌తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఓ ఫీల్డర్‌పై వ్యక్తిగత దూషణకు దిగాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన సీఏ అతనిని పాకిస్తాన్‌తో జరిగే మొదటి టెస్టు నుంచి సస్పెండ్ చేసింది. అంతేగాక, 18 నెలల కాలంలో మరోసారి ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటే, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించి అన్ని రకాలుగా అత్యున్నత ప్రమాణాలను పాటిస్తామని, ఇందులో ఎవరికీ, ఎలాంటి మినహాయింపు లేదని వ్యాఖ్యానించింది.

*చిత్రం... జేమ్స్ పాటిన్సన్‌