క్రీడాభూమి

జ్వెరెవ్‌కు థియేమ్ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 17: ఏటీపీ ఫైనల్స్ టెన్నిస్ టోర్నమెంట్ సెమీ ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు డామినిక్ థియేమ్ షాకిచ్చాడు. బలమైన సర్వీసులు, అద్భుతమైన ప్లేసింగ్స్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే జ్వెరెవ్‌ను 7-5, 6-3 తేడాతో, వరుస సెట్లలో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. కాగా, కెరీర్‌లో తొలిసారి ఏటీపీ ఫైనల్స్ టోర్నీ ఆడుతున్న గ్రీస్ ఆటగాడు స్ట్ఫోనొస్ సిట్సిపాస్‌ను టైటిల్ పోరులో ఢీ కొంటాడు. గత మ్యాచ్‌లో సీనియర్ ఆటగాడు రోజర్ ఫెదరర్‌ను 6-3, 6-4 తేడాతో ఇంటిదారి పట్టించిన సిట్సిపాస్‌పై అదే జోరును కొనసాగిస్తాడో లేదో చూడాలి.
*చిత్రం...డామినిక్ థియేమ్